Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వామ్మో..ఈ అక్క ఆయుష్షు గట్టిదే..! వంటింట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడులోంచి ఎలా తప్పించుకుందో చూస్తే..

కేవలం 28 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో భయానక దృశ్యం కనిపించింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 34 వేల మందికి పైగా వీక్షించారు. వీడియో చూసిన ఓ యూజర్ ఆ మహిళ ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టం అంటున్నారు. మరొక వినియోగదారు రాశారు.. బహుశా సిలిండర్‌లో తక్కువ గ్యాస్ ఉండవచ్చు అంటున్నారు. అందుకే పేలుడు తీవ్రత తక్కువగా ఉందని అన్నారు.

Watch: వామ్మో..ఈ అక్క ఆయుష్షు గట్టిదే..! వంటింట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడులోంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
Gas Cylinder Blast
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2024 | 4:54 PM

Share

వంటింట్లో పనిచేసేటప్పుడు కొన్ని అనుకోని ప్రమాదాలు, ఊహించని సంఘటనలు చాలాసార్లు జరుగుతుంటాయి. హఠాత్తుగా గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు, కుక్కర్‌ బ్లాస్ట్‌ వంటి సంఘటనలు కూడా అనేకం చూస్తుంటాం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ భయపెడుతుంది. ఇటీవల, అలాంటి షాకింగ్‌ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కిచెన్‌లో పనిచేసుకుంటున్న ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగింది. వంటగదిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడుతో క్షణాల్లో ఆ ఇళ్లంతా భయనక వాతావరణం ఏర్పడింది. ప్రమాదం నుంచి మహిళ ఎలా తప్పించుకోగలిగిందో సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియోలో వంటగదిలో గ్యాస్ సిలిండర్‌ పేలిన దృశ్యం కనిపిస్తుంది. సిలిండర్‌ పేలిన సమయంలో అక్కడే ఉన్న మహిళకు ప్రాణాపాయం తప్పింది. ఒక మహిళ వంటగదిలో పని చేస్తున్నది. ఊహించని విధంగా అక్కడ ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి ఆమె నేలపై పండింది. అలాగే వంటగదిలోని వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ధాటికి కింద పడి తేరుకున్న ఆమె భయంతో వంట గది నుంచి పరిగెత్తింది.. ఇదంతా ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన అంతా ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియలేదు. ఈ వీడియో @klip_ent అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్‌ చేయబడింది. కేవలం 28 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో భయానక దృశ్యం కనిపించింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 34 వేల మందికి పైగా వీక్షించారు. వీడియో చూసిన ఓ యూజర్ ఆ మహిళ ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టం అంటున్నారు. మరొక వినియోగదారు రాశారు.. బహుశా సిలిండర్‌లో తక్కువ గ్యాస్ ఉండవచ్చు అంటున్నారు. అందుకే పేలుడు తీవ్రత తక్కువగా ఉందని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..