క్యాన్సర్, షుగర్, కొలెస్ట్రాల్ సహా అనేక వ్యాధులకు ఈ పానీయం దివ్యౌషధం..! ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా తీసుకుంటే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిపాయ నీటిని తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే మూలకాలు సహజంగా రక్తాన్ని పలుచగా చేస్తాయి. దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని

క్యాన్సర్, షుగర్, కొలెస్ట్రాల్ సహా అనేక వ్యాధులకు ఈ పానీయం దివ్యౌషధం..! ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా తీసుకుంటే..
Garlic Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 11, 2024 | 3:07 PM

ప్రతి కూరగాయకు దాని స్వంత ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీరు మీ రోజు వారి ఆహారంలో అన్ని రకాల కూరగాయలను తప్పనిసరిగా తినటం అలవాటుగా చేసుకోవాలి. అలాంటి వాటిల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి చాలా శక్తివంతమైన ఔషధ పదార్ధం. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధులను నయం చేస్తుంది. శతాబ్దాలుగా వెల్లుల్లిని ఆయుర్వేద వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిలోని గుణాలు అనేక వ్యాధులను నయం చేస్తుందని చెబుతారు. వెల్లుల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. రెట్టింపు ప్రయోజనాల కోసం పరగడుపునే వెల్లుల్లి, గోరువెచ్చని నీటిని కలిపి తాగాలంటున్నారు నిపుణులు. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్,యాంటీపరాసిటిక్ వంటి మూలకాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. కానీ ఉదయం పూట ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలు తినకుండా, వెల్లుల్లి రెబ్బతో పాటు నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాధుల నుండి సురక్షితంగా ఉండాలనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బల పేస్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిపాయ నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

వెల్లుల్లి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిపాయ నీటిని తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే మూలకాలు సహజంగా రక్తాన్ని పలుచగా చేస్తాయి. దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని నమిలి నీళ్లు తాగండి.

జీర్ణ శక్తిని బలోపేతం చేయడానికి, ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని నమిలి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. జీర్ణ శక్తి బలంగా ఉంటుంది. మీరు ఏది తిన్నా అది బాగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా కడుపు సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిపాయ నీటిని తాగడం వల్ల జలుబు, దగ్గుకు దూరంగా ఉండేందుకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జలుబు, దగ్గు నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే, వెల్లుల్లిలో గాయాలు, ఏదైనా ఇన్ఫెక్షన్ త్వరగా నయం చేసే గుణాలు ఉన్నాయి. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని నమలడం, నీళ్లు తాగడం వల్ల జలుబు, ఫ్లూ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. వెల్లుల్లి అత్యంత శక్తివంతమైన మూలికలలో ఒకటి, ఇది ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా అనేక రుగ్మతలను తొలగిస్తుంది, దాని నుండి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి, వెల్లుల్లి నీటిని తాగడం మంచిది.

వెల్లుల్లి నీటిని తయారు చేసుకునే విధానం :

రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని.. రెండు కప్పు నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ తరహా డ్రింక్ తాగడం వల్ల శరీరంలోని అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు.. లేదంటే రెండు వెల్లుల్లి రెబ్బలను పేస్ట్‌గా చేసుకుని తినేసి,గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే కూడా ఫలితం ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..