AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bull Attack in America : అమెరికాలో ఎద్దు దాడి.. మహిళను ఎత్తి పడేసింది.. షాకింగ్‌ వీడియో వైరల్‌

గుంపులో నిలబడిన మహిళను ఎద్దు కొమ్ములతో పైకెత్తి నేలకేసి కొట్టినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఎద్దు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ ఎద్దు చాలా సేపు అక్కడ భీభత్సం సృష్టించింది. ఎద్దు దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఎట్టకేలకు ఆ ఎద్దును పట్టుకుని బంధించారు.

Bull Attack in America : అమెరికాలో ఎద్దు దాడి.. మహిళను ఎత్తి పడేసింది.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Bull Attack In America
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2024 | 3:48 PM

Share

భారతదేశంలో ఎద్దుల దాడికి సంబంధించిన సంఘటనలు, వీడియోలు అనేకం చూస్తుంటాం. అయితే, ప్రస్తుతం అమెరికాలో ఎద్దును అదుపు చేయలేని వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు షాక్ అవుతున్నారు.. ఎద్దు జనం మధ్యకు పరిగెత్తుకు వచ్చి ఒక మహిళను ఎత్తిపడేసింది. జరిగిన ఘటనతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియోలో ఎద్దు ఎన్‌క్లోజర్ నుండి దూకి పరుగెత్తడం కనిపించింది. సిస్టర్స్ రోడియో గ్రౌండ్స్ వెలుపల ఈ ఘటన జరిగింది. ఎద్దు కంచె దాటి అక్కడున్న వారిపై దాడి చేసిందని సిస్టర్స్ రోడియో అసోసియేషన్ తెలిపింది.

ఎద్దు పరిగెత్తుతుండగా, కొందరు దానిని పట్టుకోవడానికి పరుగులు తీయడం కనిపించింది. అయితే, ఎద్దును అదుపు చేసేందుకు వీలు లేకుండా అది వేగంగా వచ్చి మహిళను కుమ్మేసింది. గుంపులో నిలబడిన మహిళను ఎద్దు కొమ్ములతో పైకెత్తి నేలకేసి కొట్టినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఎద్దు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ ఎద్దు చాలా సేపు అక్కడ భీభత్సం సృష్టించింది. ఎద్దు దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఎట్టకేలకు ఆ ఎద్దును పట్టుకుని బంధించారు.

ఇవి కూడా చదవండి

సిస్టర్స్ రోడియో ప్రోగ్రామ్ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో పాల్గొనేందుకు, ప్రొగ్రామ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. రోడియో చాలా వినోదాత్మక క్రీడగా పరిగణించబడుతున్నప్పటికీ, కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. 84వ సిస్టర్స్ రోడియో చివరి రౌండ్‌లో ఈ సంఘటన రాత్రి 10 గంటల సమయంలో జరిగింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!