ఓమై గాడ్.. ఇదెక్కడి దారుణం..! ఖరీదైన బొలెరో కారును ఇలా వాడేస్తున్నావేంటి గురూ..?
“అతను రైతు.. తాను తలచుకుంటే ఏదైనా చేయగలడు" అని ఒక వినియోగదారు రాశాడు, "నేను ఇంత గొప్పగా ఉండాలనుకుంటున్నాను" అని మరొక వినియోగదారు రాశారు, "నాకు ఇలాంటి రైతు కావాలి. ఎవరైనా ట్రాక్టర్‌లో పేడ నింపుతారు. కానీ, ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై చాలా మంది వినియోగదారులు రైతుకు మద్ధతుగా స్పందించారు.
సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో మనకే తెలియదు. ఇక్కడ కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, కొన్ని వీడియోలు షాకింగ్‌గా కనిపిస్తాయి.. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ వ్యర్థలు, మట్టి, పేడను తీసుకెళ్లేందుకు బొలెరో కారును ఉపయోగించాడు. ఈ వీడియో మిమ్మల్ని కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే.. ఎవరైనా ఇలాంటి పేడ, వ్యర్థాలను తరలించేందుకు ట్రక్కు, ట్రాక్టర్, లారీని ఉపయోగిస్తుంటారు. కానీ, వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తి బొలెరోలో పేడ నింపుతున్న వైనం అందరినీ ఆశ్చర్యపోయేల చేసింది. లోపలంతా పేడతో బొలెరోను నింపేశాడు. ఈ భయంకరమైన స్థితిని చూస్తే ఎవరైనా సరే.. ఇదేం పనంటూ ముక్కున వెలేసుకోవాల్సిందే.! ఈ ఘటన రాజస్థాన్‌కు చెందినదిగా తెలిసింది. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి ఒక్కరూ తమ కారును ఎంతో జాగ్రత్తగా, శుభ్రంగా, అందంగా కనిపించేందుకు ఇష్టపడతారు. కారుకు చిన్న గీత తగిలినా ప్రాణం పోతుంది. కానీ, ఈ వీడియోలో బొలెరో కారు మొత్తం పేడతో నింపేశాడు ఓ వ్యక్తి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇతనికి ఇదేం పిచ్చి అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. బొలెరో లాంటి కాస్ట్లీకారులో ఇలా పేడ, మట్టిని ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ పలువురు ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు. వైరల్ వీడియోలో బొలెరో పూర్తిగా పేడ, మట్టితో నింపేసి కనిపించింది. డ్రైవర్ పక్క సీటు మాత్రమే ఖాళీగా ఉంది. వీడియోలో ఒక కార్మికుడు ఇనుప టబ్‌లో మట్టి పేడతో నింపి బొలెరో కారులో పోస్తుండటం కూడా కనిపించింది.
View this post on Instagram
ఈ వీడియో Instagram ఖాతా reenamawai001 నుండి షేర్ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోకు ప్రతిస్పందించారు. ఒక వినియోగదారు ఇలా రాశాడు.. “అతను రైతు.. తాను తలచుకుంటే ఏదైనా చేయగలడు” అని ఒక వినియోగదారు రాశాడు, “నేను ఇంత గొప్పగా ఉండాలనుకుంటున్నాను” అని మరొక వినియోగదారు రాశారు, “నాకు ఇలాంటి రైతు కావాలి. ఎవరైనా ట్రాక్టర్‌లో పేడ నింపుతారు. కానీ, ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై చాలా మంది వినియోగదారులు రైతుకు మద్ధతుగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..