సైన్స్ కి కూడా అంతుచిక్కని మిస్టరీ ప్రదేశాలు ఇవే.. తెలిస్తే గూస్‌బంప్స్‌ ఖాయం..!!

లేబెల్లె అనే వ్యక్తి ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు, అక్కడ ఓ ఇంట్లో పొయ్యి మీద వంట చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే, ప్రతి ఇంట్లోనూ పనులు అసంపూర్తిగా మిగిలిపోయి కనిపించాయట. అయితే, ఊరంతా ఎక్కడికో వెళ్లి ఉంటారని తిరిగి వస్తారేమోనని లేబెల్లే అనుకున్నారు. అయితే ఈ గ్రామంలో నివసిస్తున్న 2000 మందిలో నేటికీ ఏ ఒక్క వ్యక్తి జాడ కూడా కనిపించలేదని చెబుతారు.

సైన్స్ కి కూడా అంతుచిక్కని మిస్టరీ ప్రదేశాలు ఇవే.. తెలిస్తే గూస్‌బంప్స్‌ ఖాయం..!!
Mysterious Places
Follow us

|

Updated on: Jun 10, 2024 | 3:54 PM

మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఈ రహస్యాలు చాలా వరకు చేధించారు పరిశోధకులు. కొన్నింటిని శాస్త్రవేత్తలు ఇంకా పరిష్కరించలేదు. అలాంటివి ఎన్నో అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి. అలాంటి మిస్టీరిస్‌ ప్రదేశాలలో గ్రహాంతరవాసుల కారణంగా కొన్ని ప్రాంతాలను రహస్యంగా పరిగణిస్తారు. అలాగే, దెయ్యాల కారణంగా కొన్ని ప్రదేశాలను రహస్యంగా పరిగణిస్తారు. ఇలాగే ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. కానీ, అలాంటివి కూడా రహస్యంగా ఉన్నాయి. ఈ రహస్యాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ మనం కొన్ని రహస్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

Green mountain national forest:

అమెరికాలోని సౌత్ వెస్ట్రన్ వెర్మోంట్‌లో ఉంది ఈ గ్రీన్ మౌంటైన్ నేషనల్ ఫారెస్ట్. ఈ స్థలం చాలా రహస్యంగా పరిగణించబడుతుంది. 1945లో మెండీ రివర్స్ అనే వ్యక్తి ఈ ప్రదేశంలో గైడ్‌గా పనిచేశాడు. అతను నవంబర్ 12, 1945 న తిరిగి వస్తుండగా తప్పిపోయాడు. ఇప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఆ తరువాత 1949 సంవత్సరంలో ఈ ఫారెస్ట్‌లోకి వెళ్లిన ముగ్గురు వేటగాళ్ళు అదృశ్యమయ్యారు. ఆ తర్వాత 1949 సంవత్సరంలోనే జేమ్స్ ఇ. జెఫోర్డ్ అనే వ్యక్తి కూడా కనిపించకుండా పోయాడు. ఇక్కడ కనిపించకుండా పోయిన వారి ఆచూకీ గానీ, కనీసం వారు చనిపోయారు అనే చెప్పేందుకు మృతదేహం ఆనవాళ్లు కూడా లభించలేదు.

ఇవి కూడా చదవండి

Roswell, New Mexico:

ఈ ప్రదేశం కూడా అమెరికాలోనే ఉంది. న్యూ మెక్సికోలో ఉన్న రోస్వెల్ గ్రహాంతరవాసుల కుట్ర సిద్ధాంతాల కేంద్రంగా ఉంది. 1947లో ఈ ప్రదేశం హఠాత్తుగా చర్చలోకి వచ్చింది. ఫ్లయింగ్ సాసర్ (UFO) ప్రమాదానికి గురైందని, UFO శిధిలాలు పొలంలో పడి ఉన్నాయని ఇక్కడ పనిచేస్తున్న కొందరు వ్యక్తులు అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రదేశం ఇప్పటికీ ప్రజలకు ఒక రహస్యం.

Stonehenge tunnel:

ఇంగ్లండ్‌లో ఉన్న స్టోన్‌హెంజ్ రహస్యాలతో నిండిన ప్రదేశం. ఈ ప్రదేశం సుమారు 5000 సంవత్సరాల పురాతనమైనది. ఇది ప్రత్యేకమైన బ్లూస్టోన్ పదార్థంతో తయారు చేయబడిన భారీ మెగాలిత్ రాళ్ల వృత్తాకార సమూహంగా కనిపిస్తుంది. చూసేందుకు ఎవరు వాటిని ప్రత్యేకించి పేర్చినట్టుగా కనిపిస్తుంది. స్టోన్‌హెంజ్ ఇంగ్లండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. స్టోన్‌హెంజ్‌లోని ఈ రాళ్ల వెనుక ఒక రహస్యం దాగి ఉందని ఇక్కడి ప్రజల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరూ కనిపెట్టలేకపోయారు. స్టోన్‌హెంజ్ రాళ్ళు 23 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. 3000- 2000 BC మధ్య నిర్మించబడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటప్పుడు ఇక్క సందేహం ఎంటంటే..వీటి నిర్మాణం జరిగిన సమయంలో శాస్త్రీయ పురోగతి అసలే లేదు. కాబట్టి, ఇంత పెద్ద రాళ్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా రవాణా చేశారు. వాటిని ఈ ఆకారంలో ఎలా అమర్చారు అనేది మాత్రం నేటికి వీడని మిస్టరీనే.

Kodinhi Village in Kerala:

ప్రపంచంలోనే కాదు.. భారతదేశంలో కూడా అనేక రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో కేరళలోని కొడిన్హి అనే చిన్న గ్రామం ఒకటి ఉంది. ఈ గ్రామంలో దాదాపు 2వేల కుటుంబాలు నివసిస్తుండగా, వారిలో కనీసం 400 జతల కవలలు ఉన్నారు.. ప్రపంచంలో కవలలు మాత్రమే పుట్టే ఏకైక గ్రామం ఇదేనని నమ్ముతారు. దీని వెనుక రహస్యం ఏమిటి..? అనేది మాత్రం ఇప్పటి వరకు ఏ డాక్టర్, శాస్త్రవేత్త కనుగొనలేకపోయారు. ఈ గ్రామంలో ప్రతి 1000 ప్రసవాలకు 42 కవలలు పుడుతున్నారు. గ్రామస్తుల ప్రకారం,1949 నుండి ఇలాంటి కవలల జననం ఎక్కువగా జరుగుతోంది. కానీ 1990ల చివరి వరకు కవలల జననాల సంఖ్య పెరగడం ప్రారంభించింది. అయితే, ఇందుకు కారణం జన్యుశాస్త్రంతో పాటు, గ్రామంలోని గాలి లేదా నీటిలోని నిర్దిష్ట మూలకం వల్ల ఇది సంభవించవచ్చని వైద్యులు తెలిపారు.

Angikuni Lake Mystery:

కెనడాలో ఉన్న ఈ సరస్సు కూడా రహస్యమైనదిగా పరిగణిస్తున్నారు. దాని ఒడ్డున ఒక గ్రామం ఉంది. అదే అంతుచిక్కని రహస్యం. 1930లో ఈ గ్రామంలోని ప్రజలు హఠాత్తుగా అదృశ్యమయ్యారని చెబుతారు. లేబెల్లె అనే వ్యక్తి ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు, అక్కడ ఓ ఇంట్లో పొయ్యి మీద వంట చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే, ప్రతి ఇంట్లోనూ పనులు అసంపూర్తిగా మిగిలిపోయి కనిపించాయట. అయితే, ఊరంతా ఎక్కడికో వెళ్లి ఉంటారని తిరిగి వస్తారేమోనని లేబెల్లే అనుకున్నారు. అయితే ఈ గ్రామంలో నివసిస్తున్న 2000 మందిలో నేటికీ ఏ ఒక్క వ్యక్తి జాడ కూడా కనిపించలేదని చెబుతారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్