Viral News: ఇంట్లో నివసిస్తున్నందుకు కూతురు నుంచి అద్దె తీసుకుంటున్న తల్లి.. రీజన్ విని నెటిజన్లు ప్రశంసల వర్షం..

ప్రస్తుతం ఈ న్యూస్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఒక మహిళ ప్రతి నెలా తన సొంత కూతురి నుంచి ఇంటి అద్దె వసూలు చేస్తుంది. తన కూతురి సంక్షేమం కోసమే ఇదంతా చేస్తున్నానని ఆ మహిళ చెబుతోంది. మరి తల్లి చెబుతున్న రీజన్ ఏమిటో తెలుసుకుందాం..ది సన్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం ఆస్ట్రేలియాకు చెందిన క్యాట్ క్లార్క్ తన 20 ఏళ్ల కుమార్తె లైతీషా.. తన ఇంట్లో నివసించడానికి అద్దె వసూలు చేస్తుంది. క్యాట్ గోల్డ్ కోస్ట్‌లో నివసిస్తోంది.

Viral News: ఇంట్లో నివసిస్తున్నందుకు కూతురు నుంచి అద్దె తీసుకుంటున్న తల్లి.. రీజన్ విని నెటిజన్లు ప్రశంసల వర్షం..
Mother Charges RentImage Credit source: Pexels
Follow us

|

Updated on: Jun 10, 2024 | 4:39 PM

తల్లిదండ్రుల నుంచి ఆస్తులు డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి వెల్లగొడుతున్న పిల్లల గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే ఓ చోట సీన్ రివర్స్ అయింది.. తమ ఇంట్లో పిల్లలు ఉండాలంటే తప్పని సరిగా అద్దె చెల్లించాల్సిందే అంటున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి ఘటనలు అరుదుగా విన ఉండవచ్చు. వినడానికి ఇది వింతగా అనిపించవచ్చు.. అయితే నిజంగా ఆస్ట్రేలియాలో జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఒక మహిళ ప్రతి నెలా తన సొంత కూతురి నుంచి ఇంటి అద్దె వసూలు చేస్తుంది. తన కూతురి సంక్షేమం కోసమే ఇదంతా చేస్తున్నానని ఆ మహిళ చెబుతోంది. మరి తల్లి చెబుతున్న రీజన్ ఏమిటో తెలుసుకుందాం..

ది సన్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం ఆస్ట్రేలియాకు చెందిన క్యాట్ క్లార్క్ తన 20 ఏళ్ల కుమార్తె లైతీషా.. తన ఇంట్లో నివసించడానికి అద్దె వసూలు చేస్తుంది. క్యాట్ గోల్డ్ కోస్ట్‌లో నివసిస్తోంది. ఈ విషయాన్ని క్యాట్ క్లార్క్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన కూతురు లైతీషా నుంచి ప్రతి వారం 26 పౌండ్లు (అంటే మన దేశ కరెన్సీలో రూ. 2,761.70) తీసుకుంటున్నట్లు ఆమె చెప్పింది. దీని ప్రకారం ప్రతినెలా తన కూతురు నుంచి ఇంటికి అద్దెగా రూ.11వేలకు పైగా వసూలు చేస్తోంది.

క్యాట్ కి సంబంధించిన ఈ పోస్ట్‌కి నెటిజన్లు వివిధ రకాలైన స్పందనలు ఇచ్చారు. చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు కూతురు నుంచి అద్దె వసూలు చేయడం తప్పు, అమానవీయమని పేర్కొన్నారు. కన్న కూతురు నుంచి అద్దె వసూలు చేస్తున్న తల్లి కూడా ఉంటుందా అని కొందరు అంటున్నారు. అయితే కొందరు వ్యక్తులు తల్లి నిర్ణయాన్ని, ఆమె ఆలోచనను సమర్థించారు.

ఇవి కూడా చదవండి

అద్దె వసూలు చేయడానికి క్యాట్ చెబుతున్న కారణం ఏమిటంటే.. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదని తన కూతురికి నేర్పించాలనేది తన కోరిక అంటూ క్యాట్ చెబుతోంది. అంతేకాదు తన తల్లిదండ్రులు కూడా తనకు అదే నేర్పించారు.. ఇప్పుడు తాను తన కుమార్తెకు అదే నేర్పిస్తున్నానని క్యాట్ వెల్లడించింది. తన కుమార్తె నుంచి అద్దె రూపంలో వసూలు చేసిన డబ్బులను ప్రత్యేక ఖాతాలో జమ చేస్తున్నానని.. తన కూతురు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కూతురు నుంచి వసూలు చేసిన డబ్బులను మొదటి విడత డిపాజిట్ చేస్తానని అప్పుడు తన కూతురికి ఆ డబ్బులను ఇస్తానని క్యాట్ చెప్పింది.

తల్లి నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసల వర్షం

కాట్ ఆలోచనకు కొంతమందిని బాగా ఆకట్టుకుంది. ఇంటిని ఇల్లాలు బాగా చక్క దిద్దుకుంటుందని.. అంటున్నారు. అంతేకాదు కాట్ లక్ష్యం తన కుమార్తెకు ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్పడం.. కూతుర్ని ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగేలా చయడం అంటూ తల్లి నిర్ణయంపై నెటిజన్లు ప్రసంసల వర్షం కురిపిస్తున్నారు. విభిన్న సంస్కృతులలో కుటుంబాల ఆలోచనలు, సంప్రదాయాలు ఎంత భిన్నంగా ఉంటాయో ఈ సంఘటన తెలియజేస్తోందని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్