ఈనెల 29 శని తిరోగమనం.. నవంబరు 15 వరకు ఈ రాశులకు ధనయోగం, వీరికి అష్టకష్టాలు.. అందులో మీరున్నారా తెలుసుకోండి..

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో శనిశ్వరుడు చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నాడు. శనిశ్వరుడి ప్రభావం ఉంటే మనిషి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. శనిశ్వరుడి ప్రతి కదలిక ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది. తిరోగమనంలో కొన్ని రాశులకు ఉపశమనం శనిశ్వరుడు కలిగించబోతున్నాడు.. అదే సమయంలో కొన్ని రాశులకు చెందిన వారు బాధపడతాయి. శనిశ్వరుడు తిరోగమనం వల్ల ప్రతికూలంగా ప్రభావితం కానున్న రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

ఈనెల 29 శని తిరోగమనం.. నవంబరు 15 వరకు ఈ రాశులకు ధనయోగం, వీరికి అష్టకష్టాలు.. అందులో మీరున్నారా తెలుసుకోండి..
Lord Shani Dev
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2024 | 2:30 PM

హిందూ మతంలో శనిశ్వరుడిని న్యాయమూర్తి అంటారు. శనిశ్వరుడు ఏ వ్యక్తికైనా తన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే అతనిని కర్మఫలదాత అని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచార సమయంలో శని తిరోగమనం లేదా ప్రత్యక్షంగా మారినప్పుడు.. అది అనేక రాశులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రస్తుతం శనిశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 29 న ఈ రాశిలో తిరోగమనం చేయనున్నాడు. నవంబర్ 15 వరకు శనిశ్వరుడు తిరోగమన స్థితిలో ఉండనున్నాడు. శనిశ్వరుడి తిరోగమన స్థితి మంచిగా పరిగణించబడదు. ఎందుకంటే శనిశ్వరుడి రివర్స్ మోషన్ కారణంగా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సంబంధిత సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో శనిశ్వరుడు చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నాడు. శనిశ్వరుడి ప్రభావం ఉంటే మనిషి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. శనిశ్వరుడి ప్రతి కదలిక ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది. తిరోగమనంలో కొన్ని రాశులకు ఉపశమనం శనిశ్వరుడు కలిగించబోతున్నాడు.. అదే సమయంలో కొన్ని రాశులకు చెందిన వారు బాధపడతాయి. శనిశ్వరుడు తిరోగమనం వల్ల ప్రతికూలంగా ప్రభావితం కానున్న రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

శని తిరోగమనంతో ఏ రాశుల వారు ప్రయోజనం పొందనున్నారంటే సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు శనిశ్వరుడు నుంచి ప్రయోజనం పొందనున్నారు. ఫలితంగా సింహ రాశికి చెందిన వ్యక్తులు డబ్బు, వృత్తిలో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా లాభం పొందుతారు. అంతే కాకుండా నిలిచిపోయిన పనులు మళ్లీ పూర్తి చేసి లాభసాటి అవకాశాలుంటాయి.

ఇవి కూడా చదవండి

తిరోగమనంలో సింహ రాశికి చెందిన వ్యక్తులు చాలా ప్రయోజనాలను అందించబోతున్నాడు. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ త్వరలో తొలగిపోతాయి. దూర ప్రయాణాలకు వెళ్తారు. అయితే వెళ్లేముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఎవరికైనా ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందుతారు.

ధనుస్సు రాశి: శనిశ్వరుడు తిరోగమనం కారణంగా ఈ రాశికి చెందిన వారు కొన్ని ప్రాంతాల నుంచి ముఖ్యమైన ఫలితాలను పొందుతారు. సహోద్యోగులు ఆఫీసులో మద్దతు ఇస్తారు. దీంతో ఆఫీసులో మీ స్థానాన్ని బలోపేతం అవుతుంది.

శని తిరోగమన ప్రభావం కారణంగా ధనుస్సు రాశి వారు వ్యాపారం, ఆఫీసు పనుల్లో విజయాన్ని పొందుతారు. సోదరులు, సోదరీమణుల పట్ల ప్రేమ పెరుగుతుంది. స్నేహితులు తమ సహాయాన్ని కొనసాగిస్తారు. శని తిరోగమనం కారణంగా అదృష్టం మీ వైపు ఉంటుంది. దీని కారణంగా పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు.

శని తిరోగమనం వల్ల ఏ రాశి వారికి హాని కలుగుతుందంటే?

మేష రాశి: శనిశ్వరుడు తిరోగమనం కారణంగా మేషరాశి వారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. అలాగే పరస్పర వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున వైవాహిక జీవితంలో విభేదాలను నివారించాలి. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శనిశ్వరుడు తిరోగమన సమయంలో ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొంటారు.

వృషభ రాశి: వృషభ రాశి వారిపై శనిశ్వరుడు తిరోగమనం ప్రభావం ఆఫీసులో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో వ్యాపారస్థులు వ్యాపారంలో కూడా భారీ నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే పని చేసే వ్యక్తులు తమ తమ కఠినమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.

మకర రాశి: శనిశ్వరుడి రివర్స్ కదలిక మకర రాశి వారికి చాలా హానికరంగా ఉండనుంది. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున వీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో ఈ రాశికి చెందన వ్యక్తులు ఓపిక పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి శనిశ్వరుడు తిరోగమనం అశుభ ఫలితాలు తెచ్చిపెట్టనున్నాడు. ఈ కాలంలో కుంభ రాశి వారు శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. చేసిన పని చెడిపోయినట్లు అనిపిస్తుంది.. కనుక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పని చేసే సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి.. లేకుంటే ఉద్యోగాన్ని లేదా పని చేసే చోట పనిని కోల్పోవల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు