Horoscope Today: ఈ రాశివారికి ఉద్యోగాల్లో సమస్యలు, వ్యాపారాల్లో లాభాలు.. సోమవారం రాశిఫలాలు ఇలా
వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల కారణంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాల మీద బాగా శ్రద్ధ పెంచుతారు. కీలకమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో బాకీలు వసూలవుతాయి. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగు తుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్త అందుతుంది. భరణి నక్షత్రం వారికి ఆశించిన పదోన్నతి లభిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సుందరకాండ పఠనం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. రోహిణి నక్షత్రం వారికి ధన యోగం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల కారణంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఇతర ఉద్యోగులతో సామరస్యం వృద్ధి చెందు తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎవరితోనూ రహస్యాలు పంచుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. ఆశ్లేష నక్షత్రం వారి ప్రాభవం పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడం మీద శ్రద్ధ పెట్టాలి. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. స్వల్ప అనా రోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధి క్యత ఉన్నా లాభాలకు లోటుండదు. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గణపతిని ప్రార్ధిం చడం వల్ల కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి. పుబ్బా నక్షత్రం వారు ఆశించిన శుభవార్త వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు బాగా సహాయం చేస్తారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ వృద్ది చెందుతుంది. నిరుద్యోగులు ఊహించని శుభవార్త వింటారు. ఉత్తరా నక్షత్రం వారికి కలిసి వచ్చే సమయం ఇది. కాలభైరవాష్టకం పఠించడం వల్ల మరింత ఆర్థిక పురోగతికి అవకాశం ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితంలో ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. పెండింగ్ పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి సమస్య పరిష్కారమవుతుంది. విశాఖ వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు రొటీనుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. జ్యేష్టా నక్షత్రం వారికి ధన యోగం పడు తుంది. ఆరోగ్య భంగమేమీ ఉండదు. లలితా సహస్రనామ పఠనం వల్ల ప్రయత్నాలన్నీ అనుకూలి స్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది కానీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం పెట్టుకోవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శుభ వార్తలు వింటారు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ధన లాభం ఉంది. శివారాధన వల్ల మనశ్శాంతి కలుగు తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు మామూలుగా కొనసాగుతాయి. ప్రస్తుతా నికి సహాయాలకు, దానధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇష్టమైన ఆలయాలను సంద ర్శిస్తారు. శివార్చన వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉత్తరాషాఢ వారికి ఆదాయ వృద్ధి ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారుల ఒత్తిడికి, వేధింపులకు అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధుమిత్రులతో సానుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం శ్రేయస్కరం. లలితా సహస్రనామం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పూర్వాభాద్రవారు శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రులకు సహా యం చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖు లతో స్నేహాలు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఉద్యో గంలో మంచి మార్పులు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు రొటీనుగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. దుర్గాదేవిని స్తుతించడం మంచిది. రేవతి నక్షత్రంవారికి కలిసి వచ్చే సమయం ఇది.