Zodiac Signs: ప్రధాన గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి కీలక సమస్యల నుంచి విముక్తి..!
Telugu Astrology: ప్రధాన గ్రహాల అనుకూలతల వల్ల ఆరు రాశుల వారికి కొన్ని కీలక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. గురువు, రాహువు, కేతువు, శని వంటి ప్రధాన గ్రహాలు ఈ నెల 15 నుంచి నాలుగైదు నెలల పాటు తమ రాశుల్లో ఒంటరిగా సంచారం చేయబోతున్నందువల్ల..
ప్రధాన గ్రహాల అనుకూలతల వల్ల ఆరు రాశుల వారికి కొన్ని కీలక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. గురువు, రాహువు, కేతువు, శని వంటి ప్రధాన గ్రహాలు ఈ నెల 15 నుంచి నాలుగైదు నెలల పాటు తమ రాశుల్లో ఒంటరిగా సంచారం చేయబోతున్నందువల్ల మేషం, వృషభం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి వృత్తి, ఉద్యోగాలు, ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు గ్రహాలు ఈ ఏడాదంతా ప్రస్తుతం తాము సంచరిస్తున్న రాశుల్లోనే కొనసాగుతున్నందువల్ల ఈ రాశుల వారు తప్పకుండా సమస్యల నుంచి బయటపడే అవకాశముంటుంది.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి సమీప భవిష్యత్తులో తప్పకుండా ఉద్యోగ సంబంధమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో శీఘ్రగతిన ఎదుగుదల ఉంటుంది. పదోన్నతి, జీతభత్యాలు, అధికారులతో విభేదాలు వంటివి వాటంతటవే పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అనారోగ్యానికి తగ్గ చికిత్స లభిస్తుంది. ఆర్థిక సమస్యల్ని ఒక ప్రణాళిక ప్రకారం పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సహాయం లభిస్తుంది.
- వృషభం: ఈ రాశిలో గురు సంచారం వల్ల వైవాహిక సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆదాయాన్ని నిలవవేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన పనులు, వ్యవహారాలు క్రమంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, భాగ్య స్థానంలో ఉన్న గురువు కారణంగా ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా బయట పడడం జరుగుతుంది. శత్రు, రోగ బాధలు, బెడదల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతున్నందువల్ల ఇంట్లో పెండింగ్ శుభ కార్యాలు, విహార యాత్రలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆభరణాలను విడిపించుకోవడానికి అవకాశం కలుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఉన్న గురువు, లాభ స్థానంలో ఉన్న కేతువు కారణంగా గృహ సంబంధమైన సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరగ డంతో పాటు ఇతరత్రా కూడా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. వైవాహిక సంబంధమైన వివాదాలు సమసిపోతాయి. దాంపత్య జీవితంలో అనుకూ లతలు, అన్యోన్యతలు పెరుగుతాయి. అనారోగ్య సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గురు గ్రహం, తృతీయ స్థానంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ఈ ఏడాది తప్పకుండా కొన్ని కీలక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడడం జరుగు తుంది. ఆశించిన పురోగతికి, హోదాలు పెరగడానికి అవకాశముంటుంది. వివాహ, ఉద్యోగ ప్రయ త్నాల్లో విజయాలు సాధిస్తారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో గురువు, తృతీయంలో రాహువు సంచారం వల్ల అనేక రంగాల్లో పురోగతి చెందడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆస్తి వివాదం, గృహ వివాదం పరిష్కార దిశగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో క్రమంగా పురోగతి చోటు చేసుకుంటుంది. ఆశించిన శుభవార్తలు అందే అవకాశం ఉంది.