సమతుల్య ఆహార లేమి: ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాపు, ఆక్సీకరణ ఒత్తిడికి దారి తీస్తుంది. వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం ఈ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.