ఏదైనా రిలేషన్ షిప్ ఎన్నాళ్లు కంటిన్యూ అవుతుందనేది.. వాళ్ల మధ్య ఉన్న అనుబంధం, అవగాహనపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ప్రతి సంబంధంలోనూ తిపి, చేదు రెండూ దాగుంటాయి.. గొడవలు, పొట్లాడుకోవడాలు, మనస్పర్థలు కామన్.. కానీ ఈ తగాదాలు ఎప్పుడు పెద్ద మలుపు తిరుగుతాయో..? బంధం తెగిపోయే స్థాయికి వస్తుందని మనకు ఎప్పటికీ తెలియదు. ఈ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రజలు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ, అది పరిష్కారం కాదు.. చివరకు ఆ వ్యక్తుల మధ్య సంబంధం విచ్ఛిన్నమవుతుంది.. భార్యాభర్త లేదా అబ్బాయిఅమ్మాయి విడిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సంబంధాన్ని ప్రారంభించాలనుకునే కోరిక మొదలవుతుంది.. ఎక్కడ తప్పు చేశామో.. అక్కడ మళ్లీ సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు.. ఈ పరిస్థితుల్లో సంబంధాలను బలోపేతం చేయడానికి కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు. అవేంటో తెలుసుకోండి..