Watch Video: బాబోయ్.. ఇదేం పరిశోధన సామీ..! రోజుకు 5వేల దోమలతో కుట్టించుకుంటున్నాడు..!!

గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నారు. వీరిలో 40,000 మంది మరణిస్తున్నారు. డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ సోకిన దోమలు కుట్టడం ద్వారా వ్యాపించే వ్యాధి. అయితే, షాకింగ్ విషయం ఏంటంటే.. 80 శాతం మందికి డెంగ్యూ లక్షణాలు కనిపించకుండానే ప్రాణాలు హరిస్తుంది.

Watch Video: బాబోయ్.. ఇదేం పరిశోధన సామీ..! రోజుకు 5వేల దోమలతో కుట్టించుకుంటున్నాడు..!!
Man Feeds Blood To Mosquito
Follow us

|

Updated on: Jun 10, 2024 | 2:50 PM

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమ కాటు ద్వారా వ్యాపిస్తాయి. ఇలాంటి వ్యాధుల వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారు. డెంగ్యూ, మలేరియాపై పలువురు శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు చేస్తున్నారు. అలాంటిదే ఓ శాస్త్రవేత్త దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు స్వయంగా తన రక్తాన్ని వేలాది దోమలకు ఆహారంగా అందిస్తున్నాడు. ఆ వ్యక్తి తనను తాను దోమలతో కుట్టించుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆస్ట్రేలియాకు చెందిన పెరాన్ రాస్ అనే శాస్త్రవేత్త డెంగ్యూపై చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం పెరాన్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిజ. అందులో అతను తన రక్తాన్ని దోమలకు ఆహారంగా అందిస్తున్నాడు. అలా ప్రతి రోజూ దాదాపు 5 వేల దోమలు తన చేతులను కుడుతున్నాయని చెబుతున్నాడు. అందుకోసం అతడు దోమలతో నిండి ఉన్న ఒక ప్రత్యేక బాక్స్‌లో అతడు తన చేతిని ఉంచుతున్నాడు. గ్లాస్‌తో తయారు చేసిన ఆ బాక్స్‌లో వేల సంఖ్యలో దోమలు తిరుగుతున్నాయి. ఆ గాజు పెట్టెలో పెరాన్ చేయి పెట్టగానే పెద్ద సంఖ్యలో దోమలు దాడి చేశాయి. అతని చేతులపై తీవ్రమైన దద్దుర్లు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

@60secdocs ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్‌ చేశారు. పది సెకన్ల పాటు తన చేతిని ఆ దోమలతో నిండివున్న గ్లాస్‌ బాక్స్‌లో ఉంచుతానని డాక్టర్ పెర్రాన్ చెప్పాడు. దీంతో ఈ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుందా లేదా అని తాను పరీక్షిస్తున్నట్టుగా చేప్పాడు. ఒకసారి తన చేతికి 15 వేల దోమలు కుట్టాయని డాక్టర్ పేరన్ చెప్పారు.

View this post on Instagram

A post shared by 60 Second Docs (@60secdocs)

ల్యాబ్‌లో దోమల గుడ్లలోకి బాక్టీరియాను ఇంజెక్ట్ చేశానని పెరాన్ చెప్పాడు. బాక్టీరియా సోకిన గుడ్ల నుండి పొదిగే ఆడ దోమలు డెంగ్యూని వ్యాప్తి చేయవని చెబుతున్నాడు. ఇలాంటి దోమ కాటు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో పరీక్షిస్తున్నట్టుగా పెరాన్‌ వెల్లడించారు. దీన్ని బట్టి బ్యాక్టీరియాను మోసుకెళ్లే దోమలు డెంగ్యూ వ్యాప్తి చెందే దోమలను ఆపగలవా లేదా అనేది స్పష్టమవుతుందని చెప్పారు.

డెంగ్యూ ఎంత ప్రమాదకరం..?

గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నారు. వీరిలో 40,000 మంది మరణిస్తున్నారు. డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ సోకిన దోమలు కుట్టడం ద్వారా వ్యాపించే వ్యాధి. అయితే, షాకింగ్ విషయం ఏంటంటే.. 80 శాతం మందికి డెంగ్యూ లక్షణాలు కనిపించకుండానే ప్రాణాలు హరిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్