AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన లేడీ ప్యాసింజర్.. ఆమె లగేజ్ చెక్ చేయగా

ఇద్దరు విదేశీ మహిళా ప్రయాణికుల వద్ద నుంచి 32.79 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లోదుస్తులు, బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలిస్తుండగా అధికారులు సీజ్‌ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.19.15 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు ప్రయాణికుల్ని అరెస్ట్‌ చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన లేడీ ప్యాసింజర్.. ఆమె లగేజ్ చెక్ చేయగా
Chennai Airport
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2024 | 6:52 PM

Share

బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రోజుకో కొత్త మార్గంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. అధికారులే కంగుతినేలా వినూత్న రీతిలో బంగారాన్ని దాచి దేశాలు దాటిస్తున్నారు. మరో వైపు అధికార యంత్రాంగం సైతం అదే స్థాయిలో నిఘా ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ బంగారం అక్రమ రవాణాను బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో భారీగా బంగారం పట్టుబడింది.. రెండు వేర్వేరు విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.27 కోట్ల విలువైన 45 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. ఈ మేరకు రెండు ఘటనల్లో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చెన్నై విమానాశ్రయంలో సోమవారం కస్టమ్స్ అధికారులు ఓ సిబ్బంది నుంచి 13 కేజీల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు, విమానాశ్రయ సిబ్బంది, ట్రాన్సిట్ ప్రయాణీకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌గా పనిచేస్తున్న మహ్మద్ బర్కతుల్లా అనే వ్యక్తిని ఇంటెలిజెన్స్‌తో చెన్నై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. అతడి వద్ద నుంచి ఎయిర్‌పోర్టు డిపార్చర్ గేట్ వద్ద సోదాలు నిర్వహించి రబ్బర్‌ పేస్ట్‌ రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుంచి పేస్ట్‌ రూపంలో ఉన్న 36 పౌచులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.8.04 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

అటు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు విదేశీ మహిళా ప్రయాణికుల వద్ద నుంచి 32.79 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లోదుస్తులు, బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలిస్తుండగా అధికారులు సీజ్‌ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.19.15 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు ప్రయాణికుల్ని అరెస్ట్‌ చేసినట్లు ముంబై కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..