AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Dham: కేదార్‌నాథ్ సన్నిధిలో అధికారుల అత్యుత్సాహం..! వైరల్‌ వీడియోపై నెటిజన్ల ఫైర్‌..

థార్‌ను ఆర్మీ హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ఆలయానికి తరలించారు. ఈ థార్ కారు ద్వారా అనారోగ్యంతో ఉన్నవారు, నడవలేని వారికి సాయం అందుతుందని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు థార్ దుర్వినియోగానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో భక్తుల్లో తీవ్ర కలకలం మొదలైంది.

Kedarnath Dham: కేదార్‌నాథ్ సన్నిధిలో అధికారుల అత్యుత్సాహం..! వైరల్‌ వీడియోపై నెటిజన్ల ఫైర్‌..
Kedarnath Thar
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2024 | 6:21 PM

Share

ఇటీవల థార్ వాహనాన్ని హెలికాప్టర్ ద్వారా కేదార్‌నాథ్ ధామ్‌కు డెలివరీ చేశారు. ఇది అత్యవసరమైన వారి కోసం అని వెల్లడించారు. ఈ వాహనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరిపాలన విభాగం చెప్పిన మాటలు తప్పని విషయం బట్టబయలైంది. ఈ వాహనంలో కొందరు ప్రయాణికులు వెళుతున్న దృశ్యం ఒక్కసారిగా కలకలం రేపింది. దీనిపై ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టారు. కొంతమంది అధికారులు కేదార్‌నాథ్ ధామ్‌కు పంపిణీ చేసిన థార్ వాహనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు మిన్నంటాయి. అధికారులు తమకు తెలిసిన వారిని హెలిప్యాడ్ నుండి కేదార్‌ధామ్ ఆలయానికి థార్‌ వాహనంలో చేరవేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే, వీడియో వైరల్ కావడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి ఆదేశించారు.

కొద్ది రోజుల క్రితం టూరిజం శాఖ ఆర్మీ హెలికాప్టర్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు థార్ వాహనాన్ని ఆర్డర్ చేసింది. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి అత్యవసర సమయంలో సహాయం చేయడానికి, వారు సౌకర్యవంతంగా ఆలయానికి చేరుకోవడానికి వీలు కల్పించేందుకు గానూ థార్‌ను అందుబాటులో ఉంచారు. పరిపాలన నిర్ణయంపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు ఇదే వాహనంలో కొందరు పూర్తి ఆరోగ్యవంతులైన పురుషులు, మహిళలు థార్ లో ఆలయానికి చేరుకోవడం వివాదాస్పదంగా మారింది.

ఇవి కూడా చదవండి

కేదార్‌నాథ్ హెలిప్యాడ్ నుండి ఆలయానికి దూరం 1000 నుండి 1200 మీటర్లు మాత్రమే. అయితే, ఈ దూరాన్ని అధిగమించడం కష్టం. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు థార్‌లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి వైరల్ వీడియో తన దృష్టికి వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్యవంతులు థార్ నుంచి ఆలయానికి రావడానికి అనుమతి ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

థార్‌ను ఆర్మీ హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ఆలయానికి తరలించారు. ఈ థార్ కారు ద్వారా అనారోగ్యంతో ఉన్నవారు, నడవలేని వారికి సాయం అందుతుందని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు థార్ దుర్వినియోగానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో భక్తుల్లో తీవ్ర కలకలం మొదలైంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..