Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చీ..చీ.. వీడు మనిషేనా..? ఫేషియల్‌ కోసం వస్తే ఇలాంటి పాడుపనికి తెగబడ్డాడు..!

అయితే, అమ్జాద్‌ ఎందుకు ఇలా చేశాడనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, అతను రీల్‌ చేస్తున్నాడా లేదా కస్టమర్‌తో కావాలనే ఇలా ప్రవర్తించాడా అనేది పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. అయితే అతడు చేసిన పనికి స్థానికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Watch: చీ..చీ.. వీడు మనిషేనా..? ఫేషియల్‌ కోసం వస్తే ఇలాంటి పాడుపనికి తెగబడ్డాడు..!
Barber
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2024 | 6:56 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక బార్బర్ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసున్నారు. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఫేషియల్‌ మసాజ్ చేస్తూ ముఖానికి ఉమ్మి రాసిన దృశ్యం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఇలాంటి నీచమైన పని చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏముందంటే..

ఈ రోజుల్లో ప్రతి బార్బర్‌ షాపులోనూ ఆయిల్‌ మసాజ్, ఫేస్‌ మసాజ్‌ అనేవి కస్టమర్లు అడిగి మరీ చేయించుకుంటున్నారు. అలాంటిదే వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి బార్బర్‌ షాపులో ఫేషియల్ మసాజ్ చేయించుకుంటున్నాడు. ఆ వ్యక్తి కళ్ళు మూసుకుని రిలాక్స్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో మసాజ్‌ చేస్తున్న వ్యక్తి… అతని చేతిలో ఉమ్మివేసుకుని దాంతో ఆ వ్యక్తికి ఫేష్ మసాజ్ చేస్తు్న్నాడు. వీడియో వైరల్ కావడంతో సదరు బార్బర్ చిక్కుల్లో పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

షామ్లీలోని భవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భనేరా ఉద్దా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది. బస్టాండ్ సమీపంలో గల దుకాణం ఉన్న బార్బర్ పేరు అమ్జాద్. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు అమ్జాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే, అమ్జాద్‌ ఎందుకు ఇలా చేశాడనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, అతను రీల్‌ చేస్తున్నాడా లేదా కస్టమర్‌తో కావాలనే ఇలా ప్రవర్తించాడా అనేది పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. అయితే అతడు చేసిన పనికి స్థానికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు
గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో
గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. లైవ్ వీడియో..
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. లైవ్ వీడియో..
పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ..
పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ..
జూలై కరెంట్ బిల్లు చూడగా.. మాస్టర్ గారికి షాక్ కొట్టినంత పనైంది..
జూలై కరెంట్ బిల్లు చూడగా.. మాస్టర్ గారికి షాక్ కొట్టినంత పనైంది..
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు..
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు..
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో