Zero Wasting Wedding: పెళ్లికి అసలైన అర్ధం చెబుతున్న జంట.. పందిరి నుంచి అన్నీ పర్యావరణ హితమే.. ఎకోఫ్రెండ్లీ పెళ్లి వీడియో వైరల్..
ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో జరిగిన ఈ పెళ్లికి నెటిజన్లు విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లకు డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్‌కు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే, మరికొందరు గ్రాండ్ వెడ్డింగ్ అని చెప్పి కష్టపడి సంబంధించిన మొత్తం డబ్బును వృధా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక జంట సింపుల్ గా పెళ్లి చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
భారతీయ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మానవ జీవన విధానంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పెళ్లి వేడుకల్లో కూడా మార్పులు వచ్చాయి. పచ్చటి కొబ్బరి ఆకులతో పందిరి, అరటి ఆకుల్లో భోజనం వంటి వాటిల్లకు బదులుగా రకరరకాల ప్లాస్టిక్ వస్తువులతో పందిరి అలంకరణ, అరటి ఆకులకు బదులుగా ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, వంటివి వినియోగానికి వచ్చాయి. దీంతో వ్యర్ధాలు పెరిగిపోతూ పర్యావరణానికి హానిని కలిగిస్తున్నాయి. అయితే మళ్ళీ ప్రజల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఎకో ఫ్రెండ్లీ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. అవును ఇటీవల కాలంలో పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిగితే ప్రత్యేకం అనుకునేవాళ్లు అధికంగా ఉన్నారు. అలాంటి ఆడంబర పెళ్లిళ్ల మధ్య ఓ సింపుల్ వెడ్డింగ్ స్పెషల్ గా మారింది. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో జరిగిన ఈ పెళ్లికి నెటిజన్లు విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లకు డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్‌కు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే, మరికొందరు గ్రాండ్ వెడ్డింగ్ అని చెప్పి కష్టపడి సంబంధించిన మొత్తం డబ్బును వృధా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక జంట సింపుల్ గా పెళ్లి చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ వివాహ కార్యక్రమంలో అలంకరణల నుంచి ఆహారం, పానీయాల వరకు సహజ పదార్థాలను ఉపయోగించారు. ఇక్కడ చెరకు గెడలు, చెరకు, కొబ్బరి ఆకులతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. ఈ చెరకును పశువులకు మేతగా వేస్తారు. అదేవిధంగా కొబ్బరి ఆకులను ఉపయోగించి పందిరిని నిర్మించారు. ఆహారం కోసం అరటి ఆకులను ఉపయోగించారు. అతిథులకు రిటర్న్ బహుమతిగా జూట్ బ్యాగ్ అందించారు. ఆడంబరమైన పెళ్లిళ్ల మధ్య జరిగిన ఈ జీరో వేస్ట్ పెళ్లి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
ఈ వీడియోను డా. పూర్వీ భట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి.. నిపుణులు దీనిని జీరో-వేస్టింగ్ వెడ్డింగ్‌గా భావిస్తున్నారో లేదో నాకు తెలియదు.. అయితే ఈ ఈవెంట్‌లో మేము ఎటువంటి ప్లాస్టిక్ ఉత్పత్తిని ఉపయోగించలేదు.. పర్యావరణ నష్టాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేసామని క్యాప్షన్ జత చేశారు. వారం రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 8.4 మిలియన్ల వ్యూస్ తో పాటు రకరకాల ప్రశంసలతో కూడిన కామెంట్లు వచ్చాయి, అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుక నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
ఆచారాల పేరుతో ప్రజలు తినే తిండి నుంచి ఎన్నిటిలో వృధా చేయడం నేను చూశాను..ఈ విషయాన్నీ నా సహోద్యోగులతో వీటిని చర్చించినప్పుడల్లా.. వాళ్ల డబ్బులు వారిష్టం.. మీరు ఎందుకు పట్టించుకుంటారు? అని చెబుతారు.. అయితే నేను ఆహారాన్ని వృధా చేయడం గురించి మాట్లాడుతున్నాను.. తిండి గింజలు ఎవరు కొన్నా.. ఎవరి స్వంతమో కాదు! వృధా చేయడానికి అని నేను భావిస్తాను.. కనుక ఈ పోస్ట్‌ని చూసిన నేను చాలా సంతోషిస్తున్నాను.. పెళ్లిని ఇలా ఎకో ఫ్రెండ్లీగా ఎటువంటి వృధా లేకుండా చేయవచ్చని చూపించినందుకు ధన్యవాదం అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు అంబానీలు ఈ వీడియో చూసి ఏదైనా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. మరొకరు తన ఇద్దరు కుమార్తెలకు ఇదే విధంగా పెళ్లి చేయాలనీ కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. విలాసవంతమైన వివాహాలలో కష్టపడి సంపాదించిన సంపద, వనరులు, విపరీతమైన ఆహారం వ్యర్ధం అవుతుంది. పెళ్ళికి డబ్బులు వృధా కాకుండా ఎలా చేయవచ్చో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు అని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..