Telangana: నీటిలో తేలుకుంటూ వచ్చిన శవం.. పోలీసులు తీసేందుకు యత్నించగా.. ఓర్నీ

షర్ట్ లేదు.. అర్థం నగ్నంగా ఉన్నాడు.. ఎంత సేపు ఉన్నా చలనం లేదు. నీటిలో కొట్టుకుని వచ్చిన శవం అని భావించి స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు 108 సిబ్బంది, ప్రెస్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.

Telangana: నీటిలో తేలుకుంటూ వచ్చిన శవం.. పోలీసులు తీసేందుకు యత్నించగా.. ఓర్నీ
Funny Man
Follow us

|

Updated on: Jun 10, 2024 | 8:52 PM

ఒరెయ్ ఏందిరా బాబు ఇలా ఉన్నావ్ అంటారు ఈ వీడియో చూస్తే. నిజంగా ఫ్యూజులు ఔట్ అవుతాయ్. ఓ వ్యక్తి శవం నీటిలో తేలుతూ కనిపించడంతో.. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఖాకీలు 108 సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఎవరో అనాథ శవంలా భావించి బయటకు తీసేందుకు యత్నించిన పోలీసులకు దిమ్మతిరిగే ఝలక్ తగిలింది. పోలీసులు తెలిపిన డీటేల్స్ ప్రకారం.. హనుమకొండ టౌన్‌లోని రెండవ డివిజన్.. రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి.. మార్నింగ్ 7 నుంచి 12 గంటల వరకు కుంటలోని నీటిలోనే పడుకుని ఉండిపోయాడు. అతడు చనిపోయాడని భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శవాన్ని బయటకు తీసేందుకు యత్నించగా.. అతడు ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసి.. అందరూ కంగుతిన్నారు.

వివరాలు అడగ్గా.. తాను నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా తెలిపాడు. చల్లదనానికి నీటిలో పడుకున్నట్లు తెలిపాడు. నీటిలోకి జారిపోకుండా రాయిని పట్టుకున్నట్లు వెల్లడించాడు. 10 రోజుల నుంచి ఎండలో గ్రైనేడ్ రాయికి పనికి వెళ్లడంతో.. బాగా శ్రమ పడి ఇబ్బంది పడినట్లు తెలిపాడు. ఒక్క 50 రూపాయిలు ఇస్తే.. తాను పనిచేస్తున్న ఖాజీపేట ప్రాంతానికి వెళ్తానని అక్కడున్నవారిని కోరాడు. అతడ్ని చూస్తే మద్యం సేవించినట్లు కనిపించాడు. తదుపరి విచారణం కోసం ఆ వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు