Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో జాతీయపార్టీల యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి?

తెలంగాణలో అంతకంతకూ బలపడుతున్న భారతీయ జనతా పార్టీ.. ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో నెంబర్‌ పెరగడంతో.. ఆ దిశగా గట్టి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. కేంద్రపదవుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చింది. ఇక, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంలోనూ బిజీగా ఉంది. టార్గెట్‌ తెలంగాణ అంటూ బీజేపీ చేస్తున్న సరికొత్త వ్యూహరచన ఎలా ఉండబోతోంది?. ఇప్పుడిదే బిగ్‌ డిబేటబుల్‌ పాయింట్‌గా మారింది.

Telangana: తెలంగాణలో జాతీయపార్టీల యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి?
Big News Big Debate
Ram Naramaneni
|

Updated on: Jun 10, 2024 | 7:10 PM

Share

2018 అసెంబ్లీఎన్నికల్లో ఒకేఒక్క సీటుగెలిచి డీలాపడిన బీజేపీ… 2019 ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి సంచలనం సృష్టించింది. అలా మొదలైన జోష్‌ ఏమాత్రం తగ్గకుండా ముందుకుసాగుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించింది కాషాయసేన. అసెంబ్లీ స్థానాలను 1 నుంచి 8కి, పార్లమెంట్‌ స్థానాలనూ 4 నుంచి 8కి పెంచుకుంది. అధికార కాంగ్రెస్‌కు ఏమాత్రం తగ్గకుండా.. రాబోయేది మేమే అన్నట్టుగా గట్టి పోటీనిచ్చింది.

ఎంపీ ఎన్నికల్లో ఊహించని రీతిలో 36శాతానికి ఓటింగ్‌ షేర్‌ పెరగడం.. కాషాయదళానికి అంతులేని బలాన్నిచ్చింది. తెలంగాణ మీద లభించిన ఈ పట్టును… ఏమాత్రం సడలకుండా చేసుకోవాలన్నది ఇప్పుడు బీజేపీ మెయిన్‌ ప్లాన్‌. అందుకే, కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో.. రెండు పదవులను తెలంగాణకు కట్టబెట్టింది. కిషన్‌రెడ్డిని కేబినెట్‌ మంత్రిగా కొనసాగిస్తూ… కరీంనగర్‌ నుంచి భారీ మెజార్టీతో రెండోసారి గెలిచిన బండి సంజయ్‌ని కూడా కేబినెట్‌లోకి తీసుకున్నారు మోదీ. అది పార్టీకి మరింత బూస్టప్‌ అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు తెలంగాణ నేతలు.

రాబోయే లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌లో విజయం సాధించడం ద్వారా.. 2028అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీకి బాటలు వేసుకోవాలని పావులు కదుపుతోంది బీజేపీ. అందుకే, ఇటీవల మల్కాజ్‌గిరి నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌కు రాష్ట్రపార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో హైకమాండ్ ఉంది. అయితే ఎంపీ ఎన్నికల్లో వచ్చిన 36 శాతం ఓట్లు కాపాడుకోవడం.. ఇప్పుడు పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్. తెలంగాణలో ఎవరు పార్టీపగ్గాలు చేపట్టినా.. BRSను రిప్లేస్‌ చేయడమే ఇంపార్టెంట్‌టాస్క్ అవుతుంది. స్థానిక ఎన్నికల్లో గెలిపించి… రాష్ట్రంలో అధికారం దిశగా తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమవుతుంది.

పార్టీకి లోకల్‌గా ఊతమిచ్చేలా రెండు కేంద్రపదవులు కట్టబెట్టిన హైకమాండ్‌… రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పొజిషన్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణపై ఇలా స్పెషల్ అటెన్షన్ క్రియేట్‌ చేయడం ద్వారా.. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనే భరోసాను ప్రజల్లో నింపే విధంగా అడుగులు వేస్తోంది హైకమాండ్‌. కాంగ్రెస్‌కు ధీటుగా రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బీజేపీ.. తన యాక్షన్‌ ప్లాన్‌ అమలులో ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..