Telangana: వెంచర్‌ను నుంచి అదో రకమైన వాసన.. పోలీసులు వచ్చి చెక్ చేయగా.. వామ్మో
ఈ మధ్య అసలే పోలీసుల తనిఖీలు పెరిగిపోయాయి. రిస్క్ అవుతుంది ఎందుకు అనుకున్నాడో ఏమో ఇంట్లోనే అక్రమ దుకాణం షురూ చేశాడు. అయితే పాపం పండక తప్పదు కదా..? వన్ ఫైన్ డే పోలీసులకు అతని గురించి సమాచారం వచ్చింది. వెళ్లి అతగాడి వెంచర్‌లో చెక్ చేయగా....
మరీ ఇలా తయారయ్యారు ఏంట్రా బాబు అంటారు.. ఇతను చేసిన పని ఏంటో తెలిశాక. ఎక్కడ నుంచి అయినా తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది అనుకున్నాడో ఏమో.. తన వెంచర్‌లోనే పాడు పనికి తెరలేపాడు. అయితే పోలీసులకు అతని గురించి ఉప్పు అందడంతో అడ్డంగా బుక్కయ్యాడు. అవును గంజాయి మొక్కలు పెంచుతున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జహీరాబాద్ పట్టణ సమీపంలో గల తిరుమల వెంచర్‌లో ఓనర్ ఎ.రాఘవరెడ్డి.. గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఆ సమీప ప్రాంతాల్లో నివశించేవారికి కాస్త విచిత్రమైన వాసన వస్తూ ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ శనివారం వెంచర్‌ను తనిఖీ చేయగా బాగా ఏపుగా పెరిగిన 12 గంజాయి మొక్కలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకొని ఆయన్ను అరెస్టు చేసినట్లు సీఐ వీణారెడ్డి తెలిపారు. వాటి విలువ రూ.1.20 లక్షలు ఉండవచ్చని తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత….
గుర్తుతెలియని వ్యక్తులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలేసిన 27 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు సీజ్ చేశారు. రైల్వే అర్బన్ డీఎస్పీ జావెద్ తెలిపిన డీజల్స్ ప్రకారం.. ఎస్సై మాజీద్ శుక్రవారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తుండగా, ప్లాట్ ఫాం నంబర్–1పై ఓ ట్రాలీ బ్యాగ్, బ్యాక్‌ప్యాక్ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించాయి. కొన్నిగంటల పాటు అవి అక్కడే ఉన్నాయని తెలుసుకుని సీజ్ చేశారు. ఓపెన్‌చేసి చూడగా, 27 కిలోల గంజాయి కనిపించింది. బ్యాగులను ఎవరు తెచ్చి పెట్టారు? ఎలా వచ్చాయని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ డేటాను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..