Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Cabinet First Meeting: ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా మోడీ సర్కార్ అడుగులు.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం..

మోడీ ప్రభుత్వం 3.0 తొలి కేబినెట్ సమావేశంలో ప్రధాని ఆవాస్ యోజన పథకం అమలుపై పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇలా నిర్మించే కొత్త ఇళ్లకు ఎల్‌పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్లు వంటి సదుపాయాలను కల్పించనున్నారు. దీంతో బీజేపీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి హామీ నెరవేర్చే దిశగా ప్రధాని మోడీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుని మేనిఫెస్టోలోని తొలి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేసినట్లు అయింది.

Modi Cabinet First Meeting: ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా మోడీ సర్కార్ అడుగులు.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం..
First Cabinet Meeting Of Modi
Surya Kala
|

Updated on: Jun 10, 2024 | 7:57 PM

Share

ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా పదవిని చేపట్టిన నరేంద్ర మోడీ సర్కార్ తొలి కేబినేట్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పలు నిర్ణయాలను తీసుకుంది. బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాని ఆవాస్ యోజన పథకం అమలుపై పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని మోడీ ప్రభుత్వం 3.0 తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇలా నిర్మించే కొత్త ఇళ్లకు ఎల్‌పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్లు వంటి సదుపాయాలను కల్పించనున్నారు. దీంతో బీజేపీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి హామీ నెరవేర్చే దిశగా ప్రధాని మోడీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుని మేనిఫెస్టోలోని తొలి హామీని నెరవేర్చింది. అయితే గత 10 సంవత్సరాలలో ప్రధాని ఆవాస్ యోజన పథకంలో సుమారు 4.21 కోట్ల ఇళ్లు నిర్మించబడ్డాయి.

పీఎం హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. పీఎం హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, సర్బానంద సోనోవాల్, రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్, లాలన్ సింగ్ సహా పెద్ద నేతలు పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున.. మోడీ PMOకి చేరుకుని.. కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 17వ విడతలో నిధులను విడుదల చేశారు.

First Cabinet Meeting Of Modi 3.0

First Cabinet Meeting Of Modi 3.0

మోడీ 3.0 ఫస్ట్ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు

  1. మోడీ ప్రభుత్వం నిర్మించనున్న 3 కోట్ల కొత్త ఇళ్లలో ఎల్‌పీజీ, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. గతంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గత 10 సంవత్సరాలలో అర్హులైన పేద కుటుంబాలకు సుమారు 4.21 కోట్ల ఇళ్లు నిర్మించబడ్డాయి.
  2. మోదీ ప్రభుత్వం 3.0 తొలి కేబినెట్ సమావేశంలో పీఎం ఆవాస్ యోజనకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని మోడీ కేబినెట్ నిర్ణయించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇళ్లను నిర్మించనున్నారు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఈ క్యాబినెట్ సమావేశంలో కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, పార్లమెంటు సమావేశాన్ని పిలవాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని అభ్యర్ధించనున్నారు.
  5. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలోనే మెట్రో విస్తరణపై నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని.. దీంతో తన కోరిక నెరవేరుతుందని బీజేపీ ఎంపీ యోగేంద్ర చందోలియా అన్నారు.
  6. 10 ఏళ్ల క్రితమే మన దేశంలో పీఎంఓ అధికార కేంద్రం అనే ఇమేజ్ ఉందని ప్రధాని మోడీ అన్నారు. పీఎంవో ప్రజల పీఎంవో అయి ఉండాలి, మోడీ పీఎంవో కాకూడదని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..