Curd: పెరుగు అంటే ఇష్టం అంటూ రోజూ తినేస్తున్నారా..! ఈ వ్యాధులున్నవారు పెరుగుకి దూరంగా ఉండాలని హెచ్చరిక
ఎన్నో ఆరోగ్య ప్రయోజలు ఇచ్చే పెరుగుకి కొంతమంది దూరంగా ఉండడం మేలు. సాధారణంగా పెరుగు, రైతా, లస్సీ వంటి రకరకాలుగా పెరుగుని తీసుకుంటారు. అయితే పెరుగుని ఎక్కువుగా తీసుకుంటే కొంతమంది అనేక వ్యాధుల బారిన పడతారు. కొంతమంది పెరుగు తినకూడదో లేదా తగ్గించాలో తినాలో ఈ రోజు తెలుసుకుందాం.. కాల్షియం, ప్రొటీన్, ఫాస్పరస్, విటమిన్ B6, B12 వంటి అనేక పోషకాలు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు దృఢంగా ఉంచడంలో, శక్తిని అందించడంలో సహాయపడతాయి.
వేసవి నుంచి ఉపశమనం కోసం చల్లగా అనిపించే ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి వడగాల్పుల నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా పెరుగు, మజ్జిగను తీసుకుంటారు. పెరుగు మంచి ప్రోబయోటిక్ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఆయుర్వేదంలో కూడా పెరుగు ఆరోగ్య ప్రయోజనాలు గురించి పేర్కొంది. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజలు ఇచ్చే పెరుగుకి కొంతమంది దూరంగా ఉండడం మేలు. సాధారణంగా పెరుగు, రైతా, లస్సీ వంటి రకరకాలుగా పెరుగుని తీసుకుంటారు. అయితే పెరుగుని ఎక్కువుగా తీసుకుంటే కొంతమంది అనేక వ్యాధుల బారిన పడతారు. కొంతమంది పెరుగు తినకూడదో లేదా తగ్గించాలో తినాలో ఈ రోజు తెలుసుకుందాం..
కాల్షియం, ప్రొటీన్, ఫాస్పరస్, విటమిన్ B6, B12 వంటి అనేక పోషకాలు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు దృఢంగా ఉంచడంలో, శక్తిని అందించడంలో సహాయపడతాయి. అంతేకాదు పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగు ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది. దీని వల్ల వేసవిలో జీర్ణ సమస్యల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. అయితే కొంతమంది పెరుగుకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు అధిక కాల్షియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం నిషేధించబడింది. కనుక కిడ్నిలో స్టోన్స్ సమస్యతో బాధపడే వారు పెరుగును తక్కువ పరిమాణంలో తినాలని లేదా పెరుగు తినకూడదని సూచించారు.
లాక్టోజ్ అసహనం కొంతమందికి లాక్టోస్ అసహనం సమస్య ఉంటుంది. అలాంటి వ్యక్తులు పాలతో పాటు పెరుగు, జున్ను వరకు ఎటువంటి పాల ఉత్పత్తులను జీర్ణించుకోలేరు. లాక్టోజ్ అసహనం ఉన్నవారు పాలు లేదా పాల ఉత్పత్తి పదార్ధాలను తీసుకోవడం వలన అజీర్ణం, ఉబ్బరం, కడుపు భారం వంటి సమస్యలు మొదలవుతాయి. లాక్టోస్ అసహనం సమస్యతో బాధపడుతున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, పెరుగును తక్కువగా తీసుకోవాలి.
ఆస్తమా రోగులు ఆస్తమాతో బాధపడేవారు పెరుగు తింటే సమస్య పెరుగుతుంది. కనుక పొరపాటున ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తినకూడదు. పెరుగు చల్లగా, పుల్లగా ఉంటుంది. దీని కారణంగా శ్లేష్మం (కఫం) ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఆస్తమా సమస్య అకస్మాత్తుగా ప్రేరేపించబడుతుంది.
కీళ్లనొప్పులతో బాధపడేవారు పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పెరుగుని ఆర్థరైటిస్‌తో బాధపడేవారు నివారించడం మంచిది. వాస్తవానికి పెరుగు కీళ్లలో వాపును పెంచుతుంది. కీళ్ల నొప్పిని ప్రేరేపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..