AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సీజన్‌లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా..! ఈ నగరాలకు పొరపాటున కూడా వెళ్లొద్దు.. రీజన్ ఏమిటంటే

ఎండవేడిమి మధ్య ఎక్కడికైనా వెళ్లడం కోసం చల్లని టూరిస్ట్ స్పాట్‌లను ఎంపిక చేసుకుంటారు. వేసవిలో పొరపాటున కూడా వెళ్లకూడని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి ఈ రోజు తెల్సుకుందాము. వాస్తవానికి ఈ ప్రదేశాలలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ ప్రదేశాల్లో ప్రయాణం దయనీయంగా మారుతుంది.

ఈ సీజన్‌లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా..! ఈ నగరాలకు పొరపాటున కూడా వెళ్లొద్దు.. రీజన్ ఏమిటంటే
Summer Travel TipsImage Credit source: getty image
Surya Kala
|

Updated on: Jun 10, 2024 | 7:39 PM

Share

ఏడాది ఏడాదికి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తునన్నాయి. మండుతున్న ఎండలు, వేడి గాలుల కారణంగా పరిస్థితి దయనీయంగా ఉండగా.. తాజాగా వాతావరణ శాఖ మళ్లీ కొన్ని రోజుల పాటు ఉక్కపోత కొనసాగుతుందని హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు వేసవి సెలవులు ముగిసే సమయం ఆసన్నం అవుతోంది. దీని కారణంగా చాలామంది తమ కుటుంబ సభ్యులతో వివిధ ప్రదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. మీ పిల్లలకు కూడా వేసవి సెలవుల్లో ఉన్నట్లయితే.. ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే..మీ లిస్ట్‌లో ఈ ప్రదేశాలను పొరపాటున కూడా వెళ్ళకూడదు. ఆ ప్లేసెస్ ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఎండవేడిమి మధ్య ఎక్కడికైనా వెళ్లడం కోసం చల్లని టూరిస్ట్ స్పాట్‌లను ఎంపిక చేసుకుంటారు. వేసవిలో పొరపాటున కూడా వెళ్లకూడని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి ఈ రోజు తెల్సుకుందాము. వాస్తవానికి ఈ ప్రదేశాలలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ ప్రదేశాల్లో ప్రయాణం దయనీయంగా మారుతుంది.

ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ దాని చరిత్ర చారిత్రక కట్టడాలు, ఇక్కడ నిర్మించిన గొప్ప దేవాలయాల కారణంగా పర్యాటకులలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఎర్రకోట నుండి కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్ మొదలైన అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా సందర్శించడానికి వస్తారు. అయితే వేసవిలో ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేయకుండా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ రాజస్థాన్.. దీని చారిత్రక వారసత్వం, సంస్కృతికి సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఇది ప్రజలలో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. అయితే వేసవిలో ఇక్కడకు వెళ్ళడం ఆనందానికి బదులు అనేక సమస్యలను కలిగిస్తుంది.

ఖజురహో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఉన్న ఖజురహో ప్రజల ఆకర్షణకు కేంద్రంగా ఉంది. ఇక్కడకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రదేశాలలో ఉష్ణోగ్రత చాలా పెరిగింది. కనుక వేసవిలో మీరు ఇక్కడికి వెళ్లడం మంచిది కాదు.

దక్షిణ భారతదేశం, హంపి ప్రజలు వర్షాకాలంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ పచ్చదనం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాదు హంపి దక్షిణ భారతదేశంలోని ప్రముఖులకు కూడా ఇష్టమైన ప్రదేశం. ఈ ప్రదేశం ప్రపంచ వారసత్వ సంపదగా కూడా ప్రకటించబడింది. ప్రస్తుతం వేసవిలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం మానుకుంటే మంచిది.

ప్రయాగ్ రాజ్ ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రయాగ్ రాజ్ ఖచ్చితంగా ప్రజల సందర్శన జాబితాలో చేర్చబడింది. గంగా, యమునా నది ఒడ్డున ఉన్న ఈ నగరం త్రివేణి సంగమం, కుంభ మేళాకి ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ఇక్కడ నిర్మించిన చారిత్రక దేవాలయాలు ప్రజలను ఆకర్షిస్తాయి. ఈ త్రివేణీ సంగమ నదిలో స్నానం చేసిన తర్వాత అలసట అంతా పోతుంది. అయితే పొరపాటున కూడా వేసవిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ని సందర్శించవద్దు. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. కనుక ఇక్కడకు వెళ్లవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..