ఈ దుంపలో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మధుమేహులకు చాలా మేలు జరుగుతుంది.. ఇన్సులిన్ స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్, ఇ విటమిన్, మెగ్నిషియం నిండి ఉంటుంది. ఈ పోషకాలను కలిగి ఉన్న చామ దుంపను తరచూ తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే బరువు తగ్గేందుకూ ఇది ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్న వారు తరచూ చామదుంపని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.