రద్దీ పెరుగుతున్న అక్టోబర్.. నేనంటే నేను అంటున్న సూపర్ స్టార్స్
మొన్న మొన్నటిదాకా మనకు అక్టోబర్ అంటే గుర్తుకొచ్చింది ఒన్ అండ్ ఒన్లీ దేవర మాత్రమే. కానీ ఈ మధ్య అక్టోబర్‌లో రద్దీ ఎక్కువవుతోంది. నేనూ వస్తున్నానంటూ తలైవర్ రజనీకాంత్ డిక్లేర్ చేశారు. గేమ్ చేంజర్‌తో రామ్‌చరణ్ రెడీ అవుతున్నారు. మీతో పాటే నేనూ అంటూ మక్కళ్ సెల్వన్ ముందుకొచ్చారు... అక్టోబర్ 10 డేట్ ఫిక్స్ చేసుకోండి అంటూ అప్పుడెప్పుడో స్ట్రాంగ్‌గా చెప్పేశారు దేవర. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ.