- Telugu News Photo Gallery Cinema photos Guntur kaaram kurchi madathapetti song crossed 300 million views in youtube
Guntur Kaaram: మళ్ళీ ట్రేండింగ్ లోకి కుర్చీ మడతపెట్టి పాట.. మహేష్ ఫ్యాన్స్ అంటే మాములుగా ఉండదు మరి
ఆ శుభవార్తని రాజమౌళి చెప్పేదాకా, ఏదో రకంగా పాత జ్ఞాపకాలను నెమరేసుకోవాలని ఫిక్సయిపోయారు సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్. మహేష్‌కి సంబంధించి ఏ చిన్న అకేషన్ ఉన్నా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఓ విషయాన్ని ఎలివేట్ చేసి పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటది? చూసేద్దాం రండి...
Updated on: Jun 10, 2024 | 6:12 PM

మేజర్ సీజన్లు వేస్ట్ అయిపోవటంతో ఇప్పుడు అందరి దృష్టి దసరా, దీపావళి మీదే ఉంది. ఆల్రెడీ దసరా సందడి ముందే తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు దేవర. అక్టోబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాతో దసరా సందడి మొదలు కాబోతోంది.

గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. మహేష్ కెరీర్‌లో మంచి హిట్ సినిమాగా క్లిక్ అయింది. ఇక రీజినల్ సినిమాలు చేసే అవకాశం లేదు కాబట్టి, అన్ని రకాల మాస్ మసాలాలూ యాడ్ చేసి, డిఫరెంట్ యాక్సెంట్ ట్రై చేసి, దుమ్ము దులిపే డ్యాన్సులతో మాస్ బీట్‌లతో మజా చేసేశారు మహేష్.

గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాట ఇప్పుడు నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. వంద మిలియన్ల వ్యూస్ నుంచి ఫాస్టెస్ట్ 200 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న పాటగా ఆల్రెడీ రికార్డు క్రియేట్ చేసింది ఈ సాంగ్.

ఇప్పుడు ముచ్చటగా 300 మిలియన్ల వ్యూస్ వైపు పరుగులు తీస్తోంది. వ్యూస్ విషయంలోనే కాదు, లైకుల విషయంలోనూ గుంటూరు కారం సాంగ్ మంచి నెంబర్స్ తో దూసుకుపోతోంది.

పొలిటికల్ హీట్, ఐపీఎల్ హడావిడి ఉండటంతో స్టార్ హీరోలెవరు సమ్మర్ బరిలో దిగలేదు. టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ లాంటి హిట్స్ వచ్చినా.. ఆ జోరును మరే సినిమా కంటిన్యూ చేయలేదు.




