- Telugu News Photo Gallery Cinema photos Rana daggubati may act in bollywood periodical movie rakul preet singh reveals about her character in indian 2
Tollywood News: బాలీవుడ్ లోకి రానా.. మనసులో మాట చెప్పేసిన రకుల్
విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చరిత్రలో నిలిచిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు అంటూ ప్రకటించారు. లంకల రత్నాకర్‌గా విశ్వక్‌సేన్, రత్నమాలగా అంజలి, బుజ్జి పాత్రలో నేహాశెట్టి మెప్పించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆడిషన్‌ని అమ్మకి డెడికేట్ చేశాడు. మరి జడ్జెస్‌ని ఇంప్రెస్ చేసి గోల్డెన్ టిక్కెట్ గెలుస్తాడా? మీరు ఏం అనుకుంటున్నారు? అంటూ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ స్కంద ఆడిషన్ ప్రోమోని విడుదల చేశారు.
Updated on: Jun 10, 2024 | 5:55 PM

Gangs of Godavari: విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చరిత్రలో నిలిచిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు అంటూ ప్రకటించారు. లంకల రత్నాకర్‌గా విశ్వక్‌సేన్, రత్నమాలగా అంజలి, బుజ్జి పాత్రలో నేహాశెట్టి మెప్పించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

వీరందరికీ తలా ఓ హిట్ వస్తే, వీరిని చూసి దూసుకుపోవడానికి రెడీ అయ్యే డైరక్టర్లు ఇంకా ఎంత మందో!

Gopichand: దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం మంచి కమ్ బ్యాక్ కోసం చూస్తున్నారు. తాజాగా ఈయన తెరకెక్కిస్తున్న సినిమా విశ్వం. గోపీచంద్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు తన వింటేజ్ కామెడీ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు వైట్ల. అందులో భాగంగానే వెంకీ తరహాలోనే ఓ ట్రైన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Rana: రానా త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ అమిత్ రాయ్ త్వరలో తెరకెక్కించబోయే ఈ పీరియాడిక్ సినిమాలో రానా కూడా నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ శివాజీ పాత్రలో నటిస్తుండగా, రానా ఔరంగజేబ్ పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

Rakul Preet Singh: ఇండియన్ 2 సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఇందులో హీరో సిద్ధార్థ్‌కు జోడీగా నటిస్తున్నారీమె. తాజాగా ఇండియన్ 2 సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు రకుల్. ఈ సినిమాలో తన కారెక్టర్‌ను శంకర్ తీర్చిదిద్ధిన తీరు అద్భుతం అని.. ఎవరికీ తలొంచని అమ్మాయిగా ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు రకుల్. తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రనే ఇందులో చేస్తున్నట్లు తెలిపారు ఈ బ్యూటీ.




