- Telugu News Photo Gallery Cinema photos Actress Sreeleela planning to make her Bollywood debut alongside Ibrahim
బాలీవుడ్‌కు పక్కా ప్లాన్.. స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్‌కు రెడీ అయిన శ్రీలీల..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ కు చెక్కేయనుంది.
Updated on: Jun 10, 2024 | 3:08 PM

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకుంది అందాల భామ శ్రీలీల . తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకొని కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది.

పెళ్లి సందడి సినిమా తర్వాత ధమాకా సినిమాతో హిట్ అందుకుంది శ్రీలీల. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ కు చెక్కేయనుంది.

బాలీవుడ్ లో సినిమా చేసేందుకు శ్రీలీల రెడీ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు హీరోగా పరిచయం కానున్న సినిమాతోనే శ్రీలీల కూడా బాలీవుడ్ కు పరిచయం కానుందని టాక్ వినిపిస్తుంది.