Urine Infection: శరీరంలో నీటి కొరత యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు గురి చేస్తుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

వేసవి కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతాయని ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సమీర్ భాటి చెబుతున్నారు. యుటిఐ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగంలో సంభవించవచ్చు. వేసవిలో అనేక కారణాల వల్ల శరీరంలో నీరు లేకపోవడం వల్ల దీని కేసులు వేసవిలో పెరుగుతాయి. దీని కారణంగా శరీరం నుంచి తక్కువ మూత్రం వస్తుంది. దీంతో యూటీఐకి కారణమయ్యే బ్యాక్టీరియా శరీరంలో పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజు రోజుకీ మరిన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

Urine Infection:  శరీరంలో నీటి కొరత యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు గురి చేస్తుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
Urine InfectionImage Credit source: LIBRARY/Science Photo Library/Getty Images
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2024 | 3:59 PM

వేసవి సీజన్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. గత కొద్ది రోజులుగా హీట్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అంతేకాదు కడుపులో ఇన్ఫెక్షన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎండ వేడిమికి ప్రజలు యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. అయితే ఇది ఒక సాధారణ సమస్య. కానీ సకాలంలో నియంత్రించుకోక పోతే కిడ్నీ ఫెయిల్యూర్ ఏర్పడే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు, కారణాలు, నివారణ గురించి తెలుసుకోవడం ముఖ్యం.

వేసవి కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతాయని ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సమీర్ భాటి చెబుతున్నారు. యుటిఐ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగంలో సంభవించవచ్చు. వేసవిలో అనేక కారణాల వల్ల శరీరంలో నీరు లేకపోవడం వల్ల దీని కేసులు వేసవిలో పెరుగుతాయి. దీని కారణంగా శరీరం నుంచి తక్కువ మూత్రం వస్తుంది. దీంతో యూటీఐకి కారణమయ్యే బ్యాక్టీరియా శరీరంలో పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజు రోజుకీ మరిన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య స్త్రీలకే ఎక్కువ

డాక్టర్ సమీర్ భాటి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడతారని చెప్పారు. ఈ వ్యాధి కేసులు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి. మహిళల్లో మూత్ర నాళం ట్యూబ్ పురుషుల కంటే చిన్నది. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ప్రదేశానికి సమీపంలో ఈ ట్యూబ్ ఉండటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ సోకుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ కారణంగా పురుషుల కంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు, ప్రసరణ క్షీణిస్తుంది. దీంతో UTI సంక్రమణకు కారణమవుతుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమిటంటే

  1. మూత్ర విసర్జన సమయంలో మండుతున్న అనుభూతి
  2. తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక
  3. మూత్రంలో వాసన
  4. పొత్తి కడుపులో నిరంతర నొప్పి
  5. మూత్రం కారడం
  6. తేలికపాటి జ్వరం

యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఎలా అంటే

  1. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి, నీరు త్రాగుతూ ఉండండి
  2. మూత్ర విసర్జన చేయడానికి బద్ధకం వద్దు
  3. మురికి పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించవద్దు
  4. తినే ఆహారంలో నారింజ, పెరుగు, బచ్చలికూరను చేర్చుకోండి.. ‘
  5. క్రాన్‌ బెర్రీస్ యూటీఐ సమస్యను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి
  6. విటమిన్‌ సీ ఉన్న ఆహారం తీసుకోవాలి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?