Jamsavli Temple: ఈ ఆలయం నేటికీ మిస్టరీ.. హనుమంతుడి నాభి నుండి నీరు.. చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం..

రామనామ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉంటాడని విశ్వాసం. రామ అని అంటే చాలు తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే హనుమంతుండిని సంకట్ మోచనుడు అని కూడా అంటారు. భారతదేశంలో అనేక హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక ఆలయం వెరీ వెరీ స్పెషల్.ఆ ఆలయంలో హనుమంతుడు భక్తుల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాడని విశ్వాసం. హనుమంతుడి ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఉంది. ఈ ఆలయం పేరు జంసన్‌వాలి ఆలయం. దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం దాదాపు 22 ఎకరాల స్థలంలో నిర్మించబడింది.

Jamsavli Temple: ఈ ఆలయం నేటికీ మిస్టరీ.. హనుమంతుడి నాభి నుండి నీరు.. చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం..
Jamsavli Hanuman Temple
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2024 | 3:33 PM

హిందూ మతంలో హనుమంతుడికి విశిష్ట స్థానం ఉంది. రామ భక్త హనుమాన్ విజయ ప్రదాతగా ఆరాధిస్తారు. ఇంకా చెప్పాలంటే హనుమంతుడి గుడి లేదా విగ్రహం లేని ఊరు ఉండడం బహు అరుదు. కలియుగంలో కూడా పిలిస్తే పలికే దైవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజింపబడుతున్నాడు. చిరంజీవిగా వరం పొందిన హనుమంతుడు కలియుగంలో కూడా సజీవంగా ఉన్నాడని కూడా నమ్మకం. తనను భక్తీ శ్రద్దలతో పూజించే భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవం రామనామ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉంటాడని విశ్వాసం. రామ అని అంటే చాలు తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే హనుమంతుండిని సంకట్ మోచనుడు అని కూడా అంటారు. భారతదేశంలో అనేక హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక ఆలయం వెరీ వెరీ స్పెషల్.ఆ ఆలయంలో హనుమంతుడు భక్తుల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాడని విశ్వాసం.

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..?

హనుమంతుడి ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఉంది. ఈ ఆలయం పేరు జంసన్‌వాలి ఆలయం. దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం దాదాపు 22 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో కొలువైన హనుమంతుని దర్శనం కోసం రోజూ భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక మంగళ, శనివారాల్లో భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది.

విశ్రాంతి స్థితిలో హనుమంతుడు

ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఒక పెద్ద రావి చెట్టు క్రింద ఉంది. అది కూడా విశ్రాంతి తీసుకుంటున్న పోజులో ఉంటుంది. దీనికి స్థానికులు ఒక కథనం చెబుతారు. రావణుడితో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు.. సంజీవని కోసం హనుమంతుడు వెళ్ళాడు. అలా సంజీవిని పర్వతాన్ని తీసుకుని హనుమంతుడు తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడని నమ్ముతారు. నిద్రిస్తున్న హనుమంతుడి విగ్రహం 18 అడుగుల పొడవు ఉంటుంది. హనుమంతుడి తలపై వెండి కిరీటం ఉంది.

ఇవి కూడా చదవండి

నాభి నుండి నీరు

ఈ ఆలయంలో నిద్రిస్తున్న హనుమంతుడి విగ్రహం నాభి నుండి నీటి ప్రవాహం నిరంతరం ప్రవహిస్తుంది. ఈ నీటి ప్రవాహం ఎక్కడ నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ నీటిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

వ్యాధుల నుంచి ఉపశమనం

హనుమంతుడి విగ్రహం నాభి నుండి ప్రవహించే నీరు చాలా అద్భుతంగా ఉంటుందని నమ్మకం ఈ నీటికి చర్మ, మానసిక వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంది. ఈ ఆలయానికి వచ్చే అనారోగ్యంతో బాధపడేవారు వస్తూ ఉంటారు. అంతేకాదు ఆరోగ్యం సంతరించుకునే వరకూ ఈ ఆలయ ప్రాంగణంలో ఉంటారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. వ్యాధుల నయం చేయడానికి కేవలం హనుమంతుని నాభి నుంచి వచ్చే నీరు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎలాంటి మందులు, ఇతర వైద్య సహాయం అందదు. అయినప్పటికీ వ్యాధుల నుంచి ఉపశమనం పొంది సంతోషంగా తిరిగి వెళ్తారు భక్తులు.

ఆరతికి ప్రత్యేక ప్రాముఖ్యత

ఆలయంలో ఆరతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హారతిలో వెలువడే శబ్దం వల్ల భక్తులకు సుఖశాంతులు కలుగుతాయి. శని, మంగళవారాల్లో హనుమంతుడిని పూజించడం,  ప్రత్యేక కర్మలలో పాల్గొనడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం, శనివారం కాకుండా, వారంలోని ఇతర రోజులలో కూడా భక్తుల సందర్శనానికి వస్తారు. ముఖ్యంగా ఆదివారాలు, సెలవు దినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ఆలయానికి 2 ప్రవేశాలు ఉన్నాయి. ఒకటి పురుషులకు, మరొకటి మహిళలకు. హనుమంతుడు బాల బ్రహ్మచారి, కనుక మహిళలు కొంత దూరం నుండి దేవుడిని పూజిస్తారు. హనుమంతుని విగ్రహానికి కొంచెం దగ్గరగా వెళ్లేందుకు పురుషులకు అనుమతి ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన