AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకంలో చంద్ర దోషమా.. మానసికంగా ఇబ్బందులా ఈ మంత్రాలను జపించండి

శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శివుడిని ఆరాధన సమయంలో శివ రుద్రాష్టకం స్తోత్రాన్ని పఠించాలి. దీనివల్ల దుఃఖాల నుంచి ఉపశమనం లభిస్తుందని, జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని చెబుతారు. అంతేకాదు శివునితో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు. సోమవారం నాడు చంద్రుడిని పూజించిన వారికి మానసిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందని.. జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని నమ్ముతారు.

జాతకంలో చంద్ర దోషమా.. మానసికంగా ఇబ్బందులా ఈ మంత్రాలను జపించండి
Lord Shiva
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2024 | 8:54 PM

హిందూ మతంలో త్రిమూర్తులలో లయకారుడు శివుడిని పూజించడం అత్యంత ఫలప్రదం అని నమ్మకం. శివుడికి అంకితం అయిన సోమవారంతో పాటు రోజు శివునికి పూజ చేయడం వలన భోలాశంకరుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని విశ్వాసం. మహాదేవుడిని పార్వతిని ఆరాధించడం వ్యక్తి తన అన్ని పనులలో విజయం పొందుతాడని.. అతని కోరికలన్నీ నెరవేరుతాయని మత విశ్వాసం. శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శివుడిని ఆరాధన సమయంలో శివ రుద్రాష్టకం స్తోత్రాన్ని పఠించాలి. దీనివల్ల దుఃఖాల నుంచి ఉపశమనం లభిస్తుందని, జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని చెబుతారు.

అంతేకాదు శివునితో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు. సోమవారం నాడు చంద్రుడిని పూజించిన వారికి మానసిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందని.. జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో శివ రుద్రాష్టకం స్తోత్రం, చంద్రుడి అనుగ్రహం కోసం ఈ మంత్రాలను జపించండి.

శివ రుద్రాష్టకం స్తోత్రం

నమామీశ మీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపమ్ నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశ మాకాశవాసం భేజేహమ్ నిరాకార మోంకార మూలం తురీయం గిరీజ్ఞాన గోతీత మీశం గిరీశమ్ కరాళం మహాకాలకాలం కృపాళుం గుణాగార సంసారపారం నతోహమ్

ఇవి కూడా చదవండి

తుషారాద్రి సంకాశగౌరం గభీరం మనోభూత కోటి ప్రభాశ్రీ శరీరమ్ స్పురన్మౌళి కల్లోలినీ చారుగంగా లసత్ఫాల బాలేందు కంఠే భుజంగా

చలత్ కుండలం, భ్రూసునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ మృగాధీశ చర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి

ప్రచండం ప్రకృష్టం, ప్రగల్భం, పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశమ్ త్రయస్శూల నిర్మూలనం, శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యమ్

కాలాతీత కళ్యాణ కల్పాంత కారీ సదా సజ్జనానందదాతా పురారీ చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ

న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో! సర్వభూతాధివాసమ్

న జానామి యోగం జపం నైవ పూజాం నతోహం సదా సర్వదా శంభు తుభ్యమ్ జరాజన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి ఆపన్న మా మీశ శంభో!

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే యే పఠన్తి నరాభక్త్యా తేషాం శంభు: ప్రసీదతి

ఈ స్తోత్రంతో పాటు సోమవారం సాయంత్రం చంద్రుడి అనుగ్రహం పొందడం కోసం ఈ మంత్రాలను జపించండి.

చంద్రుడు అనుగ్రహం కోసం చంద్ర బీజ్ మంత్రాన్ని జపించాలి. మంత్రం – ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రమసే నమః! లేదా ఓం సోం సోమాయ నమః!ఈ మంత్రాలను జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు