ఈ రసం ఓ గ్లాసు తాగితే.. కొవ్వును పిండి బయటకు తీసినట్లే

ఈ రసం ఓ గ్లాసు తాగితే.. కొవ్వును పిండి బయటకు తీసినట్లే

Phani CH

|

Updated on: Jun 11, 2024 | 4:25 PM

కొలెస్ట్రాల్ పెరగడం శరీరానికి పెను ప్రమాదం. ఇది రక్త సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్.. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌లకు మరింత కారణమవుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది రక్త నాళాలలో ఉండే ఒక రకమైన కొవ్వు.. ఇది కణాలు, హార్మోన్లను తయారు చేయడానికి శరీరం ఉపయోగిస్తుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజిస్తారు.. ఒకటి HDL, రెండోది LDL. HDL అంటే మంచి కొవ్వు, LDL అంటే చెడు కొవ్వుగా పేర్కొంటారు.

కొలెస్ట్రాల్ పెరగడం శరీరానికి పెను ప్రమాదం. ఇది రక్త సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్.. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌లకు మరింత కారణమవుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది రక్త నాళాలలో ఉండే ఒక రకమైన కొవ్వు.. ఇది కణాలు, హార్మోన్లను తయారు చేయడానికి శరీరం ఉపయోగిస్తుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజిస్తారు.. ఒకటి HDL, రెండోది LDL. HDL అంటే మంచి కొవ్వు, LDL అంటే చెడు కొవ్వుగా పేర్కొంటారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని కారణంగా, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొనే సమస్య చాలా రెట్లు పెరుగుతుంది. ఇక మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అనే విషయానికి వస్తే… క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. పెద్దవారిలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి 100 mg/dL కంటే తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ HDL స్థాయి 60 mg/dL కంటే ఎక్కువగా ఉండాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే శ్వాస తీవ్రంగా తీసుకోవడం, ఛాతీలో నొప్పి, అలసట, నీరసం.. గుండె కొట్టుకునే వేగం పెరగడం లేదా తగ్గడం..శరీర బలహీనంగా అనిపించడం, కంటి పైన పసుపు రంగు కనిపించి కింది భాగంలో ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఈ చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలనుకుంటే..దీనికి టమాటా రసం దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. టొమాటో రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు, టమోటా రసంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఫైబర్, నియాసిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే.. దీనిని ఉదయాన్నే పరగడుపున ఓ గ్లాసు తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భక్తులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్ర సందర్శన

60 ఏళ్లనాటి తొలి “ఎర్త్‌” తీసిన ఆస్ట్రోనాట్‌ తాజాగా మృతి

మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. కింగ్‌ ఫిషర్‌ వచ్చేసింది

ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి… భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంపై బ్యానర్ తో ఎగిరిన విమానం