Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్ర సందర్శన

భక్తులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్ర సందర్శన

Phani CH

|

Updated on: Jun 11, 2024 | 4:22 PM

వివిధ ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని అందరూ అనుకుంటారు. కానీ పుణ్యక్షేత్ర సందర్శన అంటే ఖర్చుతోకూడుకున్నదని సామాన్యులు వెనకడుగు వేస్తుంటారు. అలాంటివారికోసం IRCTC అద్భుత అవకాశాన్ని కల్పించింది. తక్కువ ఖర్చుతో దేశంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలని భావించే భక్తుల కోసం రైల్వే శాఖ దక్షిణ భారత యాత్ర స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.14 వేలతో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను చుట్టి వచ్చే అవకాశాన్ని ఐఆర్ సీటీసీ కల్పిస్తోంది.

వివిధ ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని అందరూ అనుకుంటారు. కానీ పుణ్యక్షేత్ర సందర్శన అంటే ఖర్చుతోకూడుకున్నదని సామాన్యులు వెనకడుగు వేస్తుంటారు. అలాంటివారికోసం IRCTC అద్భుత అవకాశాన్ని కల్పించింది. తక్కువ ఖర్చుతో దేశంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలని భావించే భక్తుల కోసం రైల్వే శాఖ దక్షిణ భారత యాత్ర స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.14 వేలతో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను చుట్టి వచ్చే అవకాశాన్ని ఐఆర్ సీటీసీ కల్పిస్తోంది. ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజీలో దక్షిణాదిన ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఈ నెల 22న సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ 8 రాత్రులు, 9 పగళ్లు ఉంటుంది. ఐఆర్ సీటీసీ తీసుకొచ్చిన భారత్ గౌరవ్ రైళ్లలో తాజా యాత్రను చేపట్టింది. ఈ ప్యాకేజీలో ఏఏ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు అనే విషయానికి వస్తే.. అరుణాచలం, రామేశ్వరం, మధురై మీనాక్షి ఆలయం, అనంతపద్మనాభ స్వామి ఆలయం, శ్రీరంగనాథ స్వామి ఆలయం, బృహదీశ్వర ఆలయం.. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, కోవలం బీచ్. జూన్‌ 22న సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది. విజయవాడ, గూడురు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, తెనాలి, వరంగల్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. మొత్తం షెడ్యూలు 8 రాత్రులు, 9 పగళ్లు యాత్ర కొనసాగుతుంది. మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటారు. అరుణాచల ఆలయ సందర్శన చేసుకొని, మూడో రోజు ఉదయం 6.30 గంటలకు కుదల్‌నగర్ చేరుకుని అక్కడి నుంచి బస్సులో రామేశ్వరం సందర్శనకు వెళ్తారు. రాత్రి అక్కడే హోటల్ లో బస చేస్తారు. నాలుగో రోజు మధ్యాహ్న భోజనం తర్వాత మధురైలోని మీనాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం కన్యాకుమారికి పయనం. ఐదో రోజు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సూర్యాస్తమయాన్ని చూడొచ్చు. ఇక ఆరో రోజు ఉదయం తిరువనంతపురం వెళ్తారు. అనంత పద్మనాభస్వామిని దర్శనం తర్వాత కోవలం బీచ్ టూర్. సాయంత్రం తిరుచిరాపల్లి పయనం. ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. శ్రీరంగనాథస్వామి ఆలయ సందర్శనం తర్వాత మధ్యాహ్నం తంజావూర్ చేరుకొని బృహదీశ్వర ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఎనిమిదో రోజు తంజావూర్‌ నుంచి సికింద్రాబాద్ బయలుదేరుతారు. తొమ్మిదో రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో ఛార్జీలు ఎలా ఉంటాయంటే.. ఎకానమీలో పెద్దలకు రూ. 14,250లు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,250లు, స్టాండర్డ్‌లో పెద్దలకు రూ.21,900లు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.20,700లు, కంఫర్ట్‌లో పెద్దలకు రూ.28,450లు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.27,010లు గా నిర్ణయించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

60 ఏళ్లనాటి తొలి “ఎర్త్‌” తీసిన ఆస్ట్రోనాట్‌ తాజాగా మృతి

మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. కింగ్‌ ఫిషర్‌ వచ్చేసింది

ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి… భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంపై బ్యానర్ తో ఎగిరిన విమానం