AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారా..? ఈ నేచురల్ రెమెడీస్ మీకోసమే..!

ఊపిరితిత్తుల్లో అధికంగా పేరుకున్న కఫం శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. ఇది ఛాతీ బిగుతుగా అనిపించడాన్ని, శ్వాసలో ఇబ్బందిని కలిగించవచ్చు. కఫాన్ని సహజంగా తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలి. వేడినీటి ఆవిరి పీల్చడం, తులసి, అల్లం, మిరియాల కషాయం తాగడం, తేనే-నిమ్మరసం తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటాయి.

ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారా..? ఈ నేచురల్ రెమెడీస్ మీకోసమే..!
Healthy Lungs
Prashanthi V
|

Updated on: Feb 23, 2025 | 8:20 AM

Share

ఊపిరితిత్తుల్లో అధికంగా పేరుకున్న కఫం శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇది ఛాతీలో బిగుతుగా అనిపించడాన్ని, శ్వాసలో ఇబ్బందిని కలిగించవచ్చు. కఫాన్ని సహజంగా తొలగించడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆవిరి చికిత్స

  • ఆవిరిని పీల్చడం ద్వారా కఫం పలుచబడుతుంది. శ్వాసనాళాలు తడిగా మారి తేలికగా బయటకు వస్తుంది.
  • ఒక గిన్నెలో వేడి నీరు పోసి తలను టవల్తో కప్పుకుని 5-10 నిమిషాలు ఆవిరిని పీల్చాలి.
  • నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె కలిపితే మరింత ప్రయోజనం ఉంటుంది.
  • రోజుకు రెండు సార్లు ఇలా చేయడం ఉత్తమం.

తగినంత నీరు తాగడం

  • నీరు లేదా ఇతర వేడి ద్రవాలను ఎక్కువగా తాగడం వల్ల కఫం పలుచగా మారి బయటకు రావడం సులభమవుతుంది.
  • తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • వేడి సూప్‌లు, హెర్బల్ టీలు కఫాన్ని వదులుగా చేసి శ్వాసనాళాలను శుభ్రం చేస్తాయి.

కఫాన్ని తగ్గించే ఆహారాలు

  • కొన్ని సహజ ఆహార పదార్థాలు కఫం తగ్గించడంలో సహాయపడతాయి.
  • అల్లం.. శ్వాసనాళాలలో మంటను తగ్గించి కఫాన్ని తొలగిస్తుంది.
  • పసుపు.. యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలోని శోథాన్ని తగ్గిస్తుంది.
  • మిరియాలు.. ఊపిరితిత్తుల్లోని కఫాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి.
  • వెల్లుల్లి.. యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉండి శ్వాస మార్గాలను శుభ్రం చేస్తుంది.
  • తేనె.. సహజ కఫాన్ని తొలగించే లక్షణాలు కలిగి ఉంది.

మూలికా టీలు

  • పుదీనా టీ.. మెంథాల్ కారణంగా కఫాన్ని తగ్గించి శ్వాసకోశ మార్గాలను తెరిచేందుకు సహాయపడుతుంది.
  • వాము టీ.. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శ్వాసనాళాల్లో పేరుకున్న కఫాన్ని కరిగిస్తుంది.
  • అతి మధుర టీ.. శ్వాస సంబంధిత ఇబ్బందులను తగ్గించి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది.

శ్వాస వ్యాయామాలు

  • డీప్ బ్రీతింగ్ ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి కఫాన్ని వదులుగా చేయవచ్చు.
  • ముక్కు ద్వారా లోతుగా శ్వాస తీసుకొని నోటి ద్వారా నెమ్మదిగా వదలడం ద్వారా ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.
  • రోజుకు కనీసం 10 నిమిషాలు ఈ వ్యాయామాన్ని చేయాలి.

శారీరక శ్రమ

  • రోజువారీ వ్యాయామం, యోగా చేయడం వల్ల ఊపిరితిత్తులలో గాలి ప్రసరణ మెరుగుపడుతుంది.
  • వాకింగ్, హార్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లు కఫాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి.

ఉప్పు నీటితో పుక్కిలించడం

  • గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించడం ద్వారా గొంతు శుభ్రం అవుతుంది.
  • ఇది బ్యాక్టీరియాను తగ్గించి కఫాన్ని త్వరగా బయటకు తీసుకురాగలదు.

కఫం ఏర్పడటానికి గల కారణాలు

  • జలుబు, ఫ్లూ, బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి అంటువ్యాధులు.
  • అలెర్జీలు.. పొగ, ధూళి, పుష్పరేణువులు వంటివి కఫాన్ని పెంచుతాయి.
  • ధూమపానం.. శ్వాసకోశ మార్గాలను దెబ్బతీసి అధిక కఫం ఉత్పత్తికి కారణమవుతుంది.
  • జీర్ణ సంబంధిత సమస్యలు.. ఆమ్లం పెరగడం వల్ల ముక్కు కారటం, గొంతు సమస్యలు ఏర్పడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)