AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger Paste: ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పాడైపోతుందా? ఇలా చేయండి

సాధారణంగా ఇంట్లో తయారుచేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా త్వరగా పాడైపోతుంది. అప్పుడు దాని రుచి కూడా మారిపోతుంటుంది. మరి ఇంట్లో తయారు చేసిన వెల్లుల్లి పేస్ట్‌ త్వరగా పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలో మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా పలు చిట్కాలు అందజేస్తున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మీరు షాప్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకుంటే..

Ginger Paste: ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పాడైపోతుందా? ఇలా చేయండి
Garlic Ginger Paste
Subhash Goud
|

Updated on: Feb 08, 2024 | 1:01 PM

Share

దాదాపు అందరూ వంటల్లో వెల్లుల్లి, అల్లం పేస్ట్‌ని వాడతారు. అయితే, మీరు దానిని దుకాణం నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ ఇంట్లో తయారు చేయడం సులభమే కాకుండా ఒరిజినల్‌గా ఉంటుంది. అందులో ఎలాంటి కల్తీ ఉండదు. కానీ సాధారణంగా ఇంట్లో తయారుచేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా త్వరగా పాడైపోతుంది. అప్పుడు దాని రుచి కూడా మారిపోతుంటుంది. మరి ఇంట్లో తయారు చేసిన వెల్లుల్లి పేస్ట్‌ త్వరగా పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలో మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా పలు చిట్కాలు అందజేస్తున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

మీరు షాప్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకుంటే, రెండింటినీ సరైన నిష్పత్తిలో కలపడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో చెఫ్ పంకజ్ 60 శాతం వెల్లుల్లి, 40 శాతం అల్లం కలపమని సలహా ఇస్తున్నారు. అల్లం ఒలిచింది ఉండాలని గుర్తుంచుకోండి. లేకుంటే దాని పై తొక్క కారణంగా పేస్ట్ త్వరగా చెడిపోవచ్చు. అలాగే కొద్దిగా చేదుగా కూడా కావచ్చు.

ఇవి కూడా చదవండి

మంచి రుచి కోసం వీటిని జోడించండి

అల్లం వెల్లుల్లి రుచిని పెంచడానికి ఈ రెండు పదార్థాలే కాకుండా, మీకు కొన్ని ఇతర పదార్థాలు కూడా అవసరం. అందుకే పర్ఫెక్ట్ పేస్ట్ చేయడానికి, వెల్లుల్లి, అల్లం, ఒక చెంచా నూనె, ఒక చెంచా వెనిగర్, అర చెంచా ఉప్పు కలపండి. వెల్లుల్లి, అల్లం పేస్ట్ తయారు చేసేటప్పుడు ఒక్క చుక్క నీరు కూడా ఉండకూడదని గుర్తించుకోండి. అలాగే మిక్సీలో గ్రైండ్ చేస్తుంటే అడపాదడపా తిప్పాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇలా భద్రపరుచుకోండి.

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సిద్ధం చేసుకున్న తర్వాత శుభ్రమైన గాలి చొరబడని డబ్బాలో నింపి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. దీనితో మీరు ఈ పేస్ట్‌ను కొన్ని రోజుల పాటు పాడవకుండా ఉండడమే కాకుండా దాని నాణ్యతలో ఏ మాత్రం తేడా రాకుండా ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి