Haircare: మందారంతో జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు.. అయితే దానిని ఇలామాత్రమే ఉపయోగించాలి..!
Haircare: ఇంటి పెరట్లో కనిపించే అందమైన పుష్పాలలో మందారం ఒకటి. దాదాపు అందరి ఇళ్లలోనూ మందారం చెట్టు ఉంటుంది. ఈ పూలను దేవుడి పూజలోనూ ఉపయోగిస్తారు.
Haircare: ఇంటి పెరట్లో కనిపించే అందమైన పుష్పాలలో మందారం ఒకటి. దాదాపు అందరి ఇళ్లలోనూ మందారం చెట్టు ఉంటుంది. ఈ పూలను దేవుడి పూజలోనూ ఉపయోగిస్తారు. అయితే, మందారం పూలు దేవుడి పూజలకు, అలంకారలకు మాత్రమే కాదు.. జుట్టు సంరక్షణకు ఎంతో కీలకం. జుట్టు పొడిబారడం నుండి చుండ్రు వరకు అన్ని రకాల జుట్టు సంబంధిత సమస్యలకు మందారం చక్కటి ఔషధం. ఆయుర్వేదం ప్రకారం.. మందారం జుట్టు పెరుగుదలను ప్రేరేపించే అసాధారణమైన వైద్యం ప్రభావాలను కలిగి ఉంది. మందారం పువ్వు రేకులే కాదు, దీని ఆకులు కూడా జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి. ఇది జుట్టు పొడిబారడం, బట్టతల, స్లీపింగ్ ఫోలికల్స్, గ్రే హెయిర్, జుట్టును మృదువుగా చేస్తుంది. అయితే, దీన్ని జుట్టుకు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. మరి ఎ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మందార నూనె.. మీ జుట్టుపై మందార నూనెను మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల కుదుళ్లను పునరుజ్జీవింపజేస్తుంది. 6 నుండి 8 మందార పువ్వులు, 1 కప్పు సేంద్రీయ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ మందార రేకులను కడిగి ఆరబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. కొబ్బరి నూనెను వేడి చేసి, మందారం పేస్ట్ వేసి రెండు నిమిషాలు మళ్లీ వేడి చేయాలి. అనంతరం దానిని చల్లారబెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత రోజూ తలకు అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే పెట్టిన తరువాత.. తేలికపాటి షాంపూతో కడగాలి.
మందార, ఆమ్లా హెయిర్ మాస్క్.. ఉసిరి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని మందారం పూల ఆకులు, 3 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తీసుకోండి. ఆకులను గ్రైండ్ చేసి పౌడర్‌గా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి బాగా మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీళ్లలో తేలికపాటి షాంపూతో కడగాలి.
మందారం అలోవెరా.. మీకు మెరిసే జుట్టు కావాలంటే ఈ కాంబో బాగా పనిచేస్తుంది. కలబంద ఒక గొప్ప కండీషనర్, జుట్టు రాలడాన్ని కూడా రిపేర్ చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల మందార రేకుల పేస్ట్, కొంత అలోవెరా జెల్ అవసరం. వాటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తరువాత మీ తలపై అప్లై చేయాలి. 30-45 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.
మందారం, వేప ఆకులు.. ఈ మాస్క్ చుండ్రు సమస్యకు ఉత్తమంగా పనిచేస్తుంది. కొన్ని వేప ఆకులను తీసుకుని, కొద్దిగా నీళ్లతో మెత్తగా రుబ్బి, వాటి రసం తీసుకోవాలి. ఇప్పుడు మందార ఆకులను మెత్తగా నూరి ఆ రసంలో కలపాలి. దీన్ని మీ తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత నీటితో కడగాలి.
మందారం, పెరుగు.. పెరుగు జుట్టును బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది. ఇది స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఒక పువ్వు, 5 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. మామూలుగానే పేస్ట్‌లా చేసి హెయిర్ మాస్క్‌లా అప్లై చేసుకోవాలి. సుమారు గంటసేపు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో మెల్లగా కడగాలి.
Also read:
Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్