Benefits of Turmeric: శీతాకాలంలో పుసుపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..
Benefits of Turmeric: భారతీయ వంటకాల్లో మీరు కనిపించే అద్భుత సుగంధ ద్రవ్యాలలో పసుపు ఒకటి. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి.
Benefits of Turmeric: భారతీయ వంటకాల్లో మీరు కనిపించే అద్భుత సుగంధ ద్రవ్యాలలో పసుపు ఒకటి. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, క్యాన్సర్, అల్జీమర్స్ రాకుండా నిరోధిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. అంతే కాదు, పసుపును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ సీజన్‌లో వచ్చే అన్ని రకాల వ్యాధుల నుంచి పసుపు రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఆహారంలో పసుపును చేర్చుకోవడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం.. పసుపు భూమిపై లభించే సహజ ఔషధ పదార్థం. సాధారణ జలుబు సైనస్, కీళ్ళు నొప్పులు, అజీర్తి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. త్వరగా ఉపశమనం పొందడం కోసం.. పాలు, టీలో చిటికెడు పసుపును కలుపుకోవాలి. పసుపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
2. టాక్సిన్స్ ను తొలగిస్తుంది.. ఫంక్షన్స్, పార్టీల సందర్భంగా ఆనందంలో ఎక్కువగా తినేయడం, తాగేయడం చేస్తుంటారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, ఈ సమస్యల నుంచి బయటపడేందుకు పసుపు అద్భుతంగా పని చేస్తుంది. పాలలో గానీ, ఆహారంలో గానీ, టీ లో గానీ పసుపు వేసుకుని తిన్నా, తాగినా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని టాక్సిన్లను అది తొలగిస్తుంది.
3. ఫ్లూ సీజన్.. శీతాకాలం ప్రారంభం ఫ్లూ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దాంతో ఫ్లూ నుంచి బయటపడేందుకు చాలామంది పుసుపు మెడిసిన్‌గా వాడుతారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు తేలికపాటి ఫ్లూతో బాధపడుతున్నప్పుడు పసుపు పాలు తాగి ఉపశమనం పొందుతారు. పసుపు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. అలాగే గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
4. క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.. పసుపు అనేక వైద్యం లక్షణాలను కలిగి ఉంది. దీనిని రోజూ తీసుకోవడం ద్వారా రక్తాన్ని పలుచగా చేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులను దూరం చేస్తుంది.
Also read:
Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్