Pregnancy and Child Care: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు శెనగపప్పు తినొచ్చా.. వాటితో ప్రయోజనాలేంటి? అప్రయోజనాలేంటి?
Pregnancy and Child Care: శనగలు ఆరోగ్యానికి మంచే చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐరన్, ప్రొటీన్, కాల్షియం, ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఈ శనగల్లో ఉన్నాయి.

Pregnancy and Child Care: శనగలు ఆరోగ్యానికి మంచే చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐరన్, ప్రొటీన్, కాల్షియం, ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఈ శనగల్లో ఉన్నాయి. రోజూ ఈ పప్పును తింటే.. వారి శరీరంలో రక్త హీనత తగ్గుతుందని చెబుతారు. అందువల్ల, గర్భిణీ స్త్రీలకు కూడా ఇది చాలా మంచిదని భావిస్తారు. గర్భిణీ స్త్రీలకు సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ పోషకాలు అవసరం. ఎందుకంటే వారితో పాటు పిండం ఆరోగ్యాన్ని కూడా వారు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కాకుండా, గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా మలబద్ధకం, గ్యాస్, వికారం మొదలైన సమస్యలను కూడా మహిళలు ఎదుర్కోవలసి వస్తుంది. మరి గర్భిణీ స్త్రీలు ఈ శనగ పప్పును తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
అలసటను పోగొడుతుంది.. గర్భధారణ సమయంలో మహిళలు చాలా అలసటగా, బలహీనంగా ఉంటారు. శనగ పప్పులను తినడం వలన అలసట, బలహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది తాజాదనాన్ని ఇస్తుంది. స్త్రీలకు రిలాక్స్‌గా ఉంటుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం.. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి సమస్యతో ఇబ్బంది పడేవారికి శనగలు చాలా ఉపయోగకరం. శనగల్లో అధిక మొత్తంలో పీచు పదార్థాలు ఉంటాయి. దీని కారణంగా మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలోనూ ఇది సహాయపడుతుంది.
రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.. 65 నుండి 75 శాతం మంది మహిళలు గర్భధారణ సమయంలో రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. దాంతో భయపడుతుంటారు. అయితే శనగల్లో ఐరన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది, రక్త హీనతను తగ్గిస్తుంది.
మధుమేహం రాకుంగా కాపాడుతుంది.. గర్భధారణ సమయంలో మహిళలకు గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆ సమయంలో శనగలను తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ శనగల్లో రెసిస్టెంట్ స్టార్చ్ మరియు అమైలోజ్ ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగకుండా నిరోధిస్తాయి. దీని కారణంగా, ఇది షుగర్ ప్రమాదం నుండి కూడా రక్షిస్తుంది.
నష్టాలు కూడా ఉన్నాయి.. గర్భధారణ సమయంలో మహిళలందరికీ అలెర్జీ వస్తుంది. ఆ సందర్భంలో శనలగను అస్సలు తినకూడదు. శనగలు అలర్జీ సమస్యను మరింత పెంచుతుంది. అలాగే, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. శనగ పప్పు తినడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. ఇది సమస్యను మరింత పెంచుతుంది.
Also read:
Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్