Puneet Rajkumar: నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా ‘అప్పు’ ఫ్యాన్‌ మేడ్‌ వీడియో..

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న

Puneet Rajkumar: నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా 'అప్పు' ఫ్యాన్‌ మేడ్‌ వీడియో..
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2021 | 8:31 PM

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన హీరోల టీజర్లు, గ్లింప్స్‌లు, పాటలు ఎలాంటి సంచనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘నాటు నాటు’ పాటు యూట్యూబ్‌లో ఇప్పటివరకు 3 కోట్ల వ్యూస్‌కు చేరువైంది. ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించ‌గా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటను ఆలపించారు. ఇక ఈ పాటలో తారక్‌, రామ్‌చరణ్‌ వేసిన మాస్‌ స్టె్ప్పులు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలో చాలామంది నెటిజన్లు ఈ పాటకు స్ఫూప్‌లు, కవర్‌ సాంగ్‌లు, రీక్రియేట్‌ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ఓ బామ్మ ఈ పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే . ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం కూడా ఈ వీడియోపై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ డ్యాన్స్‌ స్టెప్పులకు నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్‌ను రూపొందించారు. ఈ వీడియోకి నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ టీం కూడా ఈ వీడియోకి స్పందించ‌డం విశేషం. కాగా ఇటీవల కన్నుమూసిన కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ అభిమాని ఒకరు ఈ ‘నాటు నాటు’ పాటను అద్భుతంగా రీక్రియేట్‌ చేశాడు. పునీత్ వేసిన డ్యాన్స్‌ స్టెప్పులకు కన్నడ వెర్షన్ మాషప్‌ను రూపొందించారు.  ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కూడా  ఒక సందర్భంలో ఈ వీడియోలో కనిపించడం విశేషం . మరి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:

Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్‌కు బిగ్‌బాస్‌ అంత ముట్టజెప్పడా..? సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న వార్త..

Puneeth Raj Kumar: ‘అప్పు’ జీవితం సినిమా తీయమని కోరుతున్న అభిమాని.. తన వంతు ప్రయత్నం చేస్తానంటున్న దర్శకుడు