Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్‌కు బిగ్‌బాస్‌ అంత ముట్టజెప్పడా..? సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న వార్త..

Bigg Boss 5 Telugu: అన్ని సీజన్‌లలో లాగే బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ కూడా ముగుస్తోన్న సమయంలో రసవత్తరంగా మారుతోంది. వారం గడుస్తున్న కొద్దీ హౌజ్‌ మేట్స్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా..

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్‌కు బిగ్‌బాస్‌ అంత ముట్టజెప్పడా..? సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న వార్త..
Aani Master
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 22, 2021 | 7:35 PM

Bigg Boss 5 Telugu: అన్ని సీజన్‌లలో లాగే బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ కూడా ముగుస్తోన్న సమయంలో రసవత్తరంగా మారుతోంది. వారం గడుస్తున్న కొద్దీ హౌజ్‌ మేట్స్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 11వ వారానికి గాను మరో కంటెస్టెంట్‌ కూడా హౌజ్‌ను వీడారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కొరియోగ్రాఫర్‌ ఆనీ  మాస్టర్‌ హౌజ్‌ను వీడారు. గత 11 వారాలుగా హౌజ్‌లో తనదైన ముద్ర వేశారు యానీ. ఒకానొక సమయంలో యానీ మాస్టర్‌ టాప్‌ 5లో నిలుస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే ఆనీ  మాస్టర్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లగానే ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అదే ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌ గురించి. 11 వారాల పాటు హౌజ్‌లో ఉన్న ఆనీ  మాస్టర్‌కు బిగ్‌బాస్‌ భారీగానే ముట్టజెప్పడాన్న వార్తలు వస్తున్నాయి. భారీ ప్రాజెక్టుల్లో పనిచేసి సెలబ్రిటీ హోదా ఉన్న ఆనీ  మాస్టర్‌కు బిగ్‌బాస్‌ వారానికి ఏకంగా రూ. 3 లక్షల మేర రెమ్యునరేషన్‌ అందించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆనీ  మాస్టర్‌ ఈ సీజన్‌లో పాల్గొన్నందుకు రూ. 30 లక్షలకుపైగా రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో ఆనీ  మాస్టర్‌కే తెలియాలి.

ఇదిలా ఉంటే ఆనీ మాస్టర్‌ ఎలిమినేషన్‌ తర్వాత.. మరో కంటెస్టెంట్‌ను బయటకు పంపించే క్రమంలో.. ఇంట్లో నామినేషన్స్ ప్రక్రియ హీట్ పుట్టించినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన బిగ్‏బాస్ ప్రోమోలో నామినేషన్స్ ప్రకియలో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. మరి హౌజ్‌లో వ్యవహారాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Also Read: Chanadrababu: ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటున్న చంద్రబాబు.. వరద బాధిత ప్రాంతాల్లో ఈనెల 23,24న పర్యటన

Wife Birthday: అక్కడ భార్య పుట్టిన రోజు మర్చిపోతే చట్టరీత్యా నేరం.. జైలు ఊచలు లెక్కించాల్సిందే..

Viral Video: ఉప్పొంగిన అభిమానం.. ఫోక్‌ సింగర్‌పై కరెన్సీ నోట్ల వర్షం.. ఏకంగా బకెట్లతో