Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife Birthday: అక్కడ భార్య పుట్టిన రోజు మర్చిపోతే చట్టరీత్యా నేరం.. జైలు ఊచలు లెక్కించాల్సిందే..

సాధారణంగా పని హడావిడిలో పడో, ఉద్యోగాల్లో బిజీగా ఉండో చాలామంది తమ భార్య పుట్టిన రోజులు మర్చిపోతుంటారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని భార్యను సముదాయించేందుకు ప్రైజ్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు

Wife Birthday: అక్కడ భార్య పుట్టిన రోజు మర్చిపోతే చట్టరీత్యా నేరం.. జైలు ఊచలు లెక్కించాల్సిందే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2021 | 5:42 PM

సాధారణంగా పని హడావిడిలో పడో, ఉద్యోగాల్లో బిజీగా ఉండో చాలామంది తమ భార్య పుట్టిన రోజులు మర్చిపోతుంటారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని భార్యను సముదాయించేందుకు ప్రైజ్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. మన దేశంలో ఇది సాధారణ విషయమైనప్పటికీ పసిఫిక్‌ మహాసముద్రంలోని ఓ దీవిలో మాత్రం భార్య పుట్టిన రోజు మర్చిపోయిన భర్తలకు జైలుశిక్ష తప్పదు. అదేంటి ఇంత చిన్న పొరపాటుకే జైలు శిక్ష అనుభవించాలా అనుకుంటున్నారా? ఇది చాలా అన్యాయమని భావిస్తున్నారా? కాని ఆ దేశంలో చట్టాలు అలాగే ఉన్నాయి మరి. పసిఫిక్‌ దీవుల్లో ఉండే ‘సమోవా’ ను మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా పరిగణిస్తారు. అక్కడి అందమైన ప్రదేశాలు, లొకేషన్లు స్వర్గాన్ని తలపిస్తాయి. కానీ ఆ దేశ నిబంధనలు మాత్రం మగవారికి నరకం. అదెందుకో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది.

భార్యల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదనే.. సమోవా దేశంలో ఎవరైనా తన సతీమణి పుట్టిన రోజును మర్చిపోతే అక్కడ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. భార్య ఫిర్యాదు చేయకపోతే ఏ సమస్య లేదు కానీ.. ఒకవేళ పోలీసులకు చెబితే మాత్రం జైలు ఊచలు లెక్కించక తప్పదు. భార్యల విషయంలో భర్తలు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండకూడదనే అక్కడి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం మొదటి సారి తప్పు చేస్తే పోలీసులు హెచ్చరించి వదిలేస్తారు. మరోసారి ఇలా చేయోద్దని మంచిగా చెప్పి ఇంటికి పంపిస్తారు. ఇక రెండోసారి మాత్రం భార్య పుట్టిన రోజు మర్చిపోయారా.. అంతే సంగతులు జైలుకు వెళ్లి కూర్చోవాల్సిందే.

ఈ చట్టాలు కూడా.. సమోవాను చూస్తుంటే ఇదేం దేశంరా బాబూ?ఇలాంటి చట్టాలున్నాయి అని అనిపిస్తోందా? ఇక్కడే కాదు మరికొన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఆశ్చర్యకరమైన చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్‌ ధరించి బయటకు వెళితే సరాసరి జైలుకెళ్లక తప్పదు. తూర్పు ఆఫ్రికాలో బయట జాగింగ్ చేయడం నేరం. సింగపూర్‌లో చూయింగ్‌ గమ్‌ నమలడంపై నిషేధం ఉంది. వాటి వల్ల పరిసరాలు మురికిగా మారుతాయని అక్కడి ప్రభుత్వం దీనిని నేరంగా పరిగణిస్తోంది. అమెరికాలోని ఓక్లహమా రాష్ట్రంలో కుక్కలపై అరిస్తే, తిడితే జైలు ఊచలు లెక్కించక తప్పదు. ఇటలీలోని మిలాన్‌ నగరంలో ఇతరులను చూసి ముఖం చిట్లించడం నేరం.

Also Read:

Peng Shuai: “లైంగిక ఆరోపణలపై విచారణ జరపాల్సిందే.. ఆ వీడియోలు నిజమైనవి కావు.. చైనా కావాలనే పక్కదోవ పట్టిస్తోంది”

Corona Virus: ప్రజల నిర్లక్ష్యం.. రష్యాలో ఆగని కరోనా కల్లోలం.. మళ్ళీ భారీగా కేసులు నమోదు..

Lockdown News: కరోనా కేసుల ఉధృతి.. ఆ దేశంలో మొదలైన 20 రోజుల పూర్తిస్థాయి లాక్‌డౌన్