AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Health: మతిమరుపు తగ్గించడానికి మెడిసిన్ అవసరం లేదు.. ఇలా చేయండి చాలు..!

నేటి ఈ బిజీ బిజీ లైఫ్‌లో మతిమరుపు, ఏకాగ్రత లోపం లాంటి ప్రాబ్లమ్స్ యూత్‌తో పాటు మిడిల్ ఏజ్‌లో ఉన్న చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు మెయిన్ రీజన్ మన బ్రెయిన్ హెల్త్. మన మేధస్సును పెంచాలంటే బ్రెయిన్‌ లోని ముఖ్యమైన న్యూరోట్రాన్స్‌మిటర్ అయిన ఎసిటైల్కోలిన్ (Acetylcholine) స్థాయిని పెంచుకోవడం అవసరం. ఈ న్యూరోట్రాన్స్‌మిటర్ అటెన్షన్, మెమరీ లాంటి మెదడు పనుల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

Brain Health: మతిమరుపు తగ్గించడానికి మెడిసిన్ అవసరం లేదు.. ఇలా చేయండి చాలు..!
Healthy Brain
Prashanthi V
|

Updated on: Jul 16, 2025 | 8:30 PM

Share

ఎసిటైల్కోలిన్ (Acetylcholine) అనేది ఒక ఇంపార్టెంట్ కెమికల్ మెసెంజర్ (న్యూరోట్రాన్స్‌మిటర్). ఇది బ్రెయిన్‌లోని నాడీ కణాల మధ్య ఇన్ఫర్మేషన్ మార్పిడికి హెల్ప్ చేస్తుంది. ఇది కేవలం మెదడు పనితీరుకే కాదు.. కండరాల కదలికలను కంట్రోల్ చేయడంలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సమ్మేళనం లెవెల్ తగ్గితే మతిమరుపు, ఏకాగ్రత లోపం, మానసిక అలసట లాంటి సింప్టమ్స్ వస్తాయి. అల్జీమర్స్ లాంటి డిజెనరేటివ్ డిసీజెస్ కూడా ఈ లెవెల్ తక్కువగా ఉండటం వల్లే వస్తాయని స్టడీస్ చెబుతున్నాయి. ఎసిటైల్కోలిన్ (Acetylcholine) లెవెల్స్‌ ని నాచురల్‌ గా పెంచే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • క్వాలిటీ స్లీప్ మస్ట్.. ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల సరిపడా నిద్రపోవడం వల్ల బ్రెయిన్ హెల్తీ గా వర్క్ చేస్తుంది. నిద్ర లేకపోతే ఎసిటైల్కోలిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది.
  • బ్రెయిన్‌ కి ఎక్సర్‌సైజ్.. పజిల్స్, చెస్, బుక్స్ చదవడం, మ్యూజిక్ ప్రాక్టీస్ లాంటి బ్రెయిన్‌ ని యాక్టివ్‌ గా ఉంచే పనులు నాడీ సంబంధాలను స్ట్రాంగ్ చేస్తాయి.
  • స్ట్రెస్ తగ్గించుకోవాలి.. ధ్యానం, యోగా, డీప్ బ్రీతింగ్ ఉన్న మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు బ్రెయిన్‌ లో న్యూరోట్రాన్స్‌మిటర్ బ్యాలెన్స్‌ని కాపాడతాయి.
  • గుడ్డు పచ్చసొన.. ఈ పార్ట్‌ లో ఎక్కువగా కోలిన్ ఉంటుంది. రోజుకు రెండు గుడ్లు తింటే డైలీ అవసరంలో 60 శాతం కోలిన్ అందుతుంది.
  • నట్స్.. బాదం, అవిసె గింజలు లాంటి నట్స్‌ లో కోలిన్ మంచి మోతాదులో ఉంటుంది. రోజూ ఒక గుప్పెడు తినడం బ్రెయిన్‌ కి బెనిఫిట్.
  • ఫ్యాటీ ఫిష్ (సాల్మన్).. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఈ ఫిష్‌ లు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. వీక్‌ కి రెండు సార్లు తినడం బెస్ట్.
  • లీఫీ వెజిటేబుల్స్.. పాలకూర, కాలే లాంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, న్యూరో ప్రొటెక్టివ్ న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్‌ని హానికరమైన కెమికల్స్ నుంచి కాపాడతాయి.

మీ మెమరీని, అటెన్షన్‌ ని నాచురల్‌ గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే.. కెమికల్ టాబ్లెట్స్‌పై డిపెండ్ అవ్వకుండా లైఫ్‌స్టైల్‌ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరైన ఫుడ్, నిద్ర, ఎక్సర్‌ సైజ్, మెంటల్ పీస్ అన్నీ కలిసినప్పుడు బ్రెయిన్ బెస్ట్‌గా వర్క్ చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు