AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ శరీరంలో ఐరన్ సరిపడా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? ఈ లక్షణాలు కనిపిస్తే లైట్ తీసుకోకండి..!

మన శరీరంలో ఐరన్ పాత్ర ఎంతో కీలకం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారీలో ముఖ్యంగా పనిచేస్తుంది. ఐరన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శక్తిలేమి, తల తిరగడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ సమస్యను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మీ శరీరంలో ఐరన్ సరిపడా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? ఈ లక్షణాలు కనిపిస్తే లైట్ తీసుకోకండి..!
Anemia Symtoms
Prashanthi V
|

Updated on: Jul 31, 2025 | 10:30 PM

Share

మన శరీరానికి కావాల్సిన పోషకాల్లో ఐరన్ చాలా ముఖ్యం. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి అవసరం. దాని వల్ల ఆక్సిజన్ శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. ఐరన్ తక్కువగా ఉంటే అనీమియా అనే సమస్య వస్తుంది. ఈ సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శక్తి లేకపోవడం

సరిపడా నిద్రపోయినా అలసిపోయినట్లు అనిపిస్తే.. లేదా మామూలు పనులు చేయడానికి కూడా శక్తి లేకపోతే అది ఐరన్ లోపం వల్ల కావచ్చు. ఇది మొదట కనిపించే లక్షణాలలో ఒకటి.

తల తిరగడం

తరచూ తలనొప్పులు రావడం లేదా తల తిరుగుతున్నట్లు అనిపించడం కూడా ఐరన్ లోపానికి గుర్తు కావచ్చు. మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇలా అవుతుంది.

చేతులు, కాళ్లు చల్లగా..

శరీరంలో రక్తం సరిగా ప్రవహించకపోతే, చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా అనిపించవచ్చు. ఇది కూడా ఐరన్ లోపాన్ని సూచించే వాటిలో ఒకటి.

చర్మం రంగు మారడం

ఐరన్ లోపం వల్ల శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. ఇది ముఖ చర్మంతో పాటు శరీరంలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. చర్మం రంగు మసకబారడానికి లేదా తెల్లగా కనిపించడానికి దారి తీస్తుంది.

గోళ్లు బలహీనపడటం

ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు గోళ్లు చాలా సున్నితంగా మారతాయి. త్వరగా విరిగిపోతాయి. ఇది శరీరంలో పోషకాలు తక్కువగా ఉన్నాయని తెలిపే గుర్తు.

జుట్టు రాలడం

ఐరన్ లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలడం, కాంతి లేకపోవడం, చర్మం పొడిగా మారడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇది రక్తం తక్కువగా ప్రవహిస్తున్నట్లు సూచిస్తుంది.

పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే దయచేసి సొంతంగా చికిత్స చేసుకోకండి. సరైన పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ఐరన్ లోపాన్ని సరైన సమయంలో గుర్తిస్తే పెద్ద ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్