పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా..? అయితే ఈ ఫుడ్స్ రోజూ తినిపించండి..!
పిల్లల్లో మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో ఆహారం చాలా ముఖ్యమైనది. మెదడు సరిగా పనిచేయాలంటే సరైన పోషకాలు అవసరం. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా 3 కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు లాంటివి మెదడులోని నరాలు బాగా పనిచేయడానికి సాయపడతాయి. మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచి ఏకాగ్రతను పెంచే కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. మన మెదడు ఆరోగ్యంగా, చురుకుగా పని చేయాలంటే సరైన పోషకాలు చాలా అవసరం. కొన్ని ఆహారాలు మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో ఎక్కువగా ఉండే DHA అనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి ఒత్తిడిని తగ్గిస్తూ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రోజూ కొన్ని వాల్‌నట్స్ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
బ్లూబెర్రీస్
ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడులో ఉన్న కణాల మధ్య సమాచారం బాగా వెళ్ళడానికి సహాయపడతాయి. దీనితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో ఉండే కెఫైన్, ఫ్లావనాయిడ్లు మెదడును ఉత్తేజపరుస్తాయి. మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
గుడ్లు
గుడ్లలో ఉండే కోలిన్ అనే పోషకం మెదడు ఎదుగుదలకు చాలా ముఖ్యం. బి గ్రూప్ విటమిన్లు నరాల వ్యవస్థ సరిగా పనిచేయడానికి సహాయపడతాయి.
గుమ్మడికాయ గింజలు
వీటిలో మెగ్నీషియం, జింక్, రాగి, ఐరన్ లాంటి ఖనిజాలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా జింక్ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కొవ్వు చేపలు
సార్డీన్స్, సాల్మన్ లాంటి చేపల్లో ఎక్కువగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు నిర్మాణానికి పని చేయడానికి అవసరం. ఇవి న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
పసుపు
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం మెదడు వాపును తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. దీనిని వేడి పాలలో కలిపి తీసుకోవచ్చు.
ఆకుకూరలు
పాలకూర, చుక్కకూర లాంటి ఆకుకూరల్లో విటమిన్ కె, ఫోలేట్, లూటిన్ లాంటి పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
ఓట్స్
ఓట్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ప్రోబయోటిక్స్ ఉండి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి చురుకుగా ఉండే పిల్లల మెదడుకు శక్తిని అందిస్తాయి.
నారింజ
విటమిన్ C ఎక్కువ ఉండే నారింజ జ్ఞాపకశక్తిని పెంచడంలో చూసే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ఆహారాలను మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




