Iodine Benefits: శరీరానికి అయోడిన్ ఎంత అవసరం? దాని వల్ల కలిగే ఉపయోగాలేంటి?
మనం ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన మినరల్స్ లో అయోడిన్ కూడా ఒకటి. అయోడిన్ ఒక సూక్ష్మపోషకం. ప్రతిరోజూ దీని అవసరం శరీరానికి కావలసి ఉంటుంది. వయసును బట్టి.. తక్కువ మోతాదులో అయోడిన్ ను తీసుకోవాలి. అయోడిన్ అనగానే కేవలం ఉప్పులోనే ఉంటుందనుకుంటే పొరపాటే. క్రాన్ బెర్రీలు, ఆలుగడ్డలు, స్ట్రాబెర్రీలు, మొక్కజొన్న, అరటిపండ్లు, బీన్స్, పాలకూర, కొబ్బరినూనె, బ్రోకొలి, హిమాలయన్ సాల్ట్, సోంపు గింజల ఆకు, సముద్రపు ఉప్పు, సముద్రపు చేపలు, పెరుగు, కోడిగుడ్లు, టర్కీ మాంసం..
మనం ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన మినరల్స్ లో అయోడిన్ కూడా ఒకటి. అయోడిన్ ఒక సూక్ష్మపోషకం. ప్రతిరోజూ దీని అవసరం శరీరానికి కావలసి ఉంటుంది. వయసును బట్టి.. తక్కువ మోతాదులో అయోడిన్ ను తీసుకోవాలి. అయోడిన్ అనగానే కేవలం ఉప్పులోనే ఉంటుందనుకుంటే పొరపాటే.
క్రాన్ బెర్రీలు, ఆలుగడ్డలు, స్ట్రాబెర్రీలు, మొక్కజొన్న, అరటిపండ్లు, బీన్స్, పాలకూర, కొబ్బరినూనె, బ్రోకొలి, హిమాలయన్ సాల్ట్, సోంపు గింజల ఆకు, సముద్రపు ఉప్పు, సముద్రపు చేపలు, పెరుగు, కోడిగుడ్లు, టర్కీ మాంసం.. తదితర ఆహార పదార్థాల్లో మనకు అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. అయోడిన్ ను తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆ గ్రంథి సరిగ్గా పనిచేయాలన్నా అయోడిన్ చాలా అవసరం, అలాగే గర్భస్థ శిశువు నాడీమండల ఎదుగుదలకు, పుట్టే పిల్లలు సరైన బరువు కలిగి ఉండేందుకు, స్త్రీలకు వక్షోజాల సమస్యలు రాకుండా ఉండేందుకు, బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి రక్షణ పొందేందుకు అయోడిన్ అవసరం ఉంటుంది. అందుకే అయోడిన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
శరీరంలో అయోడిన్ లోపిస్తే.. మెడవద్ద వాపు కనిపిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథి వాపునకు సూచిక. దానిని ఏ మాత్రం టచ్ చేసినా.. ఒత్తిడికి గురిచేసినా నొప్పి కలుగుతుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో, నిద్రలో ఇబ్బందులు, తీవ్రమైన అలసట, సాధారణ ఉష్ణోగ్రతలోనూ చలిగా ఉన్నట్లు అనిపించడం, జుట్టు ఎక్కువగా రాలడం, అనూహ్యంగా బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆయా లక్షణాలు ఉంటే.. వైద్యుడిని సంప్రదించి వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
ఏయే వయసు వారికి ఎంత మోతాదులో అయోడిన్ అవసరం:
-అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 6 నెలల వయసు పిల్లల వరకూ.. రోజుకి 110 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం అవుతుంది.
-7-12 నెలల మధ్య చిన్నారులకు రోజుకి 130 మైక్రోగ్రాముల అయోడిన్ కావాల్సి ఉంటుంది.
-1-8 సంవత్సరాల వయసు పిల్లలకు 90 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం అవుతుంది.
-9-13 సంవత్సరాల మధ్య పిల్లలకు 120 మైక్రోగ్రాముల అయోడిన్ కావలసి ఉంటుంది.
-14 ఏళ్లు, ఆ పై వయసు యువత రోజుకి 150 మైక్రోగ్రాముల అయోడిన్ ను తీసుకోవాలి.
-గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ 220 మైక్రోగ్రాముల అయోడిన్ శరీరానికి అందేలా చూసుకోవాలి.
-బాలింతలు (పాలిచ్చే తల్లులు) ప్రతి నిత్యం 290 మైక్రోగ్రాముల అయోడిన్ ను తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి