Health Test Kit: మీ స్మార్ట్ ఫోన్‌తోనే ఆరోగ్య పరీక్షలు.. 30 సెకన్లలోనే ఫలితాలు.. ఇక డయాగ్నోస్టిక్ సెంటర్లతో పనేలేదు..
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై (IIT-B)కి చెందిన ముగ్గురు పూర్వ విద్యార్థులు సరికొత్త హెల్త్ టెస్ట్ కిట్ ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం సెల్ ఫోన్ సాయంతోనే మీ యూరిన్ తో చెప్పగలిగే అన్ని ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తోంది.
కాలం మారుతోంది. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత సమగ్ర సమాచారాన్ని మన కళ్ల ముందు ఉంచుతోంది. అన్ని రంగాల్లోనూ ఇదే తరహా అభివృద్ధి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా వైద్య రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. అధునాతన యంత్రాలు, పరికరాలు మనిషి ఆయుర్థానాన్ని మరింత పేంచేందుకు సాయపడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై (IIT-B)కి చెందిన ముగ్గురు పూర్వ విద్యార్థులు సరికొత్త హెల్త్ టెస్ట్ కిట్ ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం సెల్ ఫోన్ సాయంతోనే మీ యూరిన్ తో చెప్పగలిగే అన్ని ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తోంది. అది కూడా కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
30 సెకన్లలోనే ఫలితాలు..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై కి చెందిన పూర్వ విద్యార్థులు అనురాగ్ మీనా, నికుంజ్ మల్పానీ, ప్రతీక్ లోథా నియోడాక్స్ అనే హెల్త్ స్టార్టప్ ను నెలకొల్పారు. దాని నుంచి ఓ హెల్త్ కిట్ ని అభివృద్ధి చేశారు. ఇది సెల్ ఫోన్ సాయంతో పనిచేస్తుంది. ఇది రోగి మూత్రం ద్వారా కేవలం 30 సెకన్లలో ఫలితాలను అందిస్తుంది. నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో జరిగిన ప్రదర్శనలో నియోడాక్స్ టెస్ట్ కిట్‌ను ప్రదర్శించారు. స్టార్టప్ వ్యవస్థాపకులలో ఒకరైన నికుంజ్ మల్పానీ మాట్లాడుతూ, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలోనే ఆరోగ్యానికి డయాగ్నోస్టిక్స్ ప్రాముఖ్యతను గ్రహించి దీనిని తయారు చేశామన్నారు. ఈ కిట్ లో ఐదు ప్రాథమిక ఇన్‌స్టంట్ యూరిన్ టెస్ట్ కిట్‌లు ఉంటాయన్నారు. అలాగే నియోడాక్స్ క్రానిక్ కిడ్నీ వ్యాధి, వృద్ధుల టెస్ట్ కిట్, గర్భధారణ సమయంలో ఉపయోగించే మహిళల కోసం మెటర్నిటీ కేర్ కిట్ కూడా అభివృద్ధి చేశామన్నారు.
ఖర్చును తగ్గిస్తాయి..
స్టార్టప్ వ్యవస్థాపకులలో ఒకరైన అనురాగ్ మీనా మాట్లాడుతూ ఈ టెస్ట్ కిట్‌లు ప్రతి ఇంటికీ ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడతాయని చెప్పారు. అంతేకాక సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా మొత్తం పరీక్ష ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయన్నారు. మరో సభ్యుడు ప్రతీక్ లోథా మాట్లాుడూ ఈ స్టార్టప్ రక్తం, యోని ఉత్సర్గ, వీర్యం మొదలైన వివిధ మానవ బయో-ఫ్లూయిడ్‌ల కోసం తక్షణ పరీక్ష కిట్‌లను రూపొందించేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు.
కిట్ ఎలా పనిచేస్తుందంటే..
దీనికి సంబంధించిన వివరాలు స్టార్టప్ వ్యూహాత్మక భాగస్వామ్య మేనేజర్ మనస్వి షా మాట్లాడుతూ.. హెల్త్ కిట్ లోని ఓ కార్డును రోగి మూత్రంలో ఒక సెకను పాటి ఉంచి.. దానిని సెల్ ఫోన్ అప్పటకే ఇన్ స్టాల్ చేసిన నియోడాక్స్ యాప్ సాయంతో ఫొటో తీయాలన్నారు. ఇది తమ క్లౌడ్ సర్వర్ లో అప్ లోడ్ అయ్యి అక్కడ ఉన్న అల్గా రిథమ్ కార్డ్ ని స్కాన్ చేసి, కేవలం 30 సెకన్లలోనే ఫలితాలను ఇస్తుందని వివరించారు. త్రయంబక్ తాలూకాలోని తమ పబ్లిక్ హెల్త్ సెంటర్లలో (పిహెచ్‌సి) ఈ ఇన్‌స్టంట్ టెస్ట్ కిట్‌లను ఉపయోగించడం కోసం నియోడాక్స్‌తో తాము అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశామని నాసిక్ జిల్లా పరిషత్ ఆరోగ్య అధికారి డాక్టర్ హర్షల్ నెహెటే తెలిపారు. తమ ఏడు పీహెచ్ సీలలో తల్లుల సంరక్షణ కోసం ఈ ఇన్‌స్టంట్ టెస్ట్ కిట్‌లను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నిర్ధారిస్తున్నామని చెప్పారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..