Health Tips: ‘టీ’తో కలిపి ఈ ఆహారపదార్ధాలను తీసుకుంటున్నారా.. అలాగైతే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!
Health Tips: టీ .. ఈ మాట వింటే చాలు చాలామందికి హుషారు వచ్చేస్తుంది. ఒక్క చిన్న కప్పు టీ తాగినా బద్ధకం వదిలి తీరి.. హుషారుగా ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి రెడీ అయిపోతారు. నిజానికి ఈ టీ..
Health Tips: టీ .. ఈ మాట వింటే చాలు చాలామందికి హుషారు వచ్చేస్తుంది. ఒక్క చిన్న కప్పు టీ తాగినా బద్ధకం వదిలి తీరి.. హుషారుగా ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి రెడీ అయిపోతారు. నిజానికి ఈ టీ .. అలవాటు భారతీయులకు బ్రిటిష్ వారు మనదేశంలో అడుగు పెట్టిన తర్వాత వచ్చిందే.. వారు మనదేశాన్ని విడిచి వెళ్లినా ఇప్పటికీ ఈ తేనీరు తాగే అలవాటు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తేనీరు ప్రియులు రోజు రోజుకీ అధికమవుతూనే ఉన్నారు. అంతేకాదు ఈ తేనీరులో అనేక రకాలు తయారు చేస్తూ.. విభిన్న రుచులను ఆస్వాదిస్తున్నారు. అయితే మనదేశంలో ఎక్కువగా టీని పాలు వేసుకుని తాగుతారు. చాలా మందికి రోజు మొదలు పెట్టాలంటే టీ కావాలి. మరికొందరు.. గంట గంటకు నీరు తగినట్లు టీ తాగుతారు. అయితే మరికొందరు టీ తో పాటు మరికొన్ని ఆహారపదార్ధాలను కలిపి తీసుకుంటారు. ఇలా కొన్ని పదార్ధాలను తేనీరుతో కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే కొన్ని పదార్ధాలను టీ తో సమానంగా. లేదా ముందు, తర్వాత తీసుకోకూడదని అంటున్నారు. టీ తో కాంబినేషన్ గా తీసుకోకూడని ఆహారపదార్ధాలు ఏమిటో చూద్దాం..
మొలకెత్తిన గింజలు:
చాలామంది మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి మంచిది అని .. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు తింటారు. అయితే ఇలా మొలకెత్తిన గింజలు తినడానికి ముందు గానీ.. తర్వాత గానీ టీ తాగకూడదు. కనీసం మొలకెత్తిన గింజలను తిన్న తర్వాత.. లేదా టీ తాగిన తర్వాత ఎప్పుడు తీసుకున్నా కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలని సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజల్లో ఫైటేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది భాస్వర మూలకంగా ఇది పనిచేస్తుంది. కనుక టీతో పాటు మొలకెత్తిన గింజలను తినడకూడదు. తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లెమ్ తో ఇబ్బంది పడాల్సి వస్తుందట.
ఆకు కూరలు:
టీ తాగడానికి ముందు లేదా తాగిన అనంతరం ఐరన్ తో ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. ముఖ్యంగా ఆకు కూరల్ని అసలు తీసుకోకూడదు. ఎందుకంటే టీలో టానిన్లు మరియు ఆక్సలేట్‌లు ఉంటాయి. కనుక ఇవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీంతో ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట.
పచ్చికూరగాయలు: టీ తాగడానికి ముందు కానీ టీ తాగిన తర్వాత కానీ పచ్చి కాయగూరల్ని అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా బ్రోకలీ అసలు తీసుకోకూడదు. పచ్చి కూరలో ఉండే గోయిట్రోజన్లు కొందరిలో ఐయోడిన్ లోపాన్ని తీసుకొస్తాయి. కనుక టీ తాగడానికి ముందు కానీ తర్వాత కానీ అస్సలు పచ్చికూరగాయలు తినకూడదు అంటున్నారు.
శనగపిండి ఆహారపదార్ధాలు:
సర్వసాధారణంగా టీ పాటు పకోడీని కలిసి తింటారు. ఇది సర్వసాధారణంగా అందరూ చేసే పనే.. అయితే టీ టైమ్ స్నాక్స్ గా శనగ పిండితో చేసే పదార్ధాలను తినడం తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది. టీతాగుతూ.. శనగపిండి తో చేసిన ఆహారపదార్ధాలు తిండడం వలన కొంతమందిలో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాదు ఈ కాంబో శరీరం పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కనుక టీతో ఈ కంబోని తగ్గించడం లేదా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి.
పసుపు:
టీ తాగేటప్పుడు పసుపు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ కాంబినేషన్ గ్యాస్, అసిడిటీ లేదా మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. పసుపు , తేయాకులు విరుద్ధ ప్రయోజనాలుకలిగి ఉన్నాయి.
Also Read: తొలి రాజకీయ నవల ‘మాలపల్లి’కి నూరేళ్లు.. నవల తెలుగు నవలా సాహిత్యంలో చిరస్మరణీయం.