Malapalli Novel: తొలి రాజకీయ నవల ‘మాలపల్లి’కి శత జయంతి సదస్సు… నవల తెలుగు నవలా సాహిత్యంలో చిరస్మరణీయం. 

Malapalli Novel: వందేళ్ల క్రితమే భారత దేశంలోని సాంఘీక, ఆర్థిక, ఆధ్యాత్మిక అసమానతలను చూపించిన పుస్తకమే మాలపల్లి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. గుంటూరులో..

Malapalli Novel: తొలి రాజకీయ నవల 'మాలపల్లి'కి శత జయంతి సదస్సు... నవల తెలుగు నవలా సాహిత్యంలో చిరస్మరణీయం. 
Malapalli Novel
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2021 | 1:12 PM

Malapalli Novel: వందేళ్ల క్రితమే భారత దేశంలోని సాంఘీక, ఆర్థిక, ఆధ్యాత్మిక అసమానతలను చూపించిన పుస్తకమే ‘మాలపల్లి’ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. గుంటూరులో మాలపల్లి శత జయంతి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ కవులు, రచయితలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. రామదాసు, సంగదాసు, వెంకట దాసు పాత్రల చిత్రీకరణ ద్వారా అనాటి సమాజ పరిస్థితులను కళ్ళకట్టినట్లు చూపించారన్నారు. సంగ దాసు గాంధీ సిద్దాంతాలకు ప్రతీకగా, వెంకట దాసు భగత్ సింగ్ ఆలోచనలకు ప్రతీకగా ఈ నవలలో కనిపిస్తారన్నారు. దళిత సమస్య పరిష్కారాన్ని నవలో ఉన్నవ లక్ష్మినారాయణ చూపించారన్నారు. తెలుగు సాహిత్యంలో మహా ప్రస్థానం, గబ్బిలం, మాలపల్లి పుస్తకాలు మత గ్రంధాలవంటివన్నారు. జీవన ప్రవాహంలో కొత్త పోకడలు, ధోరణలు వస్తుంటాయని వాటిన్నింటిని కొన్ని పుస్తకాలు ప్రతిబింబిస్తుంటాయని కవి శివారెడ్డి అన్నారు.

తెలుగు సాహిత్యంలోనే మాలపల్లి మణిహారం వంటిదని, ప్రపంచ సాహిత్యంతో పోల్చదగినదని అన్నారు. గాంధీజీ జాతీయోద్యమ రాజకీయాల్లోకి రావడానికి ముందే ఉన్నవ ఈ పుస్తకాన్ని రచించారని కే శ్రీనావాస్ అన్నారు. భాయతీయ వాస్తవ పరిస్థితులను అక్షర బద్దం చేసిన మాలపల్లి నవలను మరింతగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆజాదీ అమృతోత్సవ్ లో భాగంగా ఇటువంటి సదస్సులను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు.

ఉన్నవ లక్ష్మినారాయణ నాటి సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించాలని.. సమసమాజాన్ని స్థాపించాలనేయ్ లక్ష్యంతో పనిచేశారు. కుల వ్యవస్థని నిరసిస్తూ.. అగ్రవర్ణాలు, హరిజనులు కలిసి మెలసి ఉండాలని భావించారు. ఉన్నవ 1922లో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి రాయవెల్లురు జైలుకు వెళ్లారు. అక్కడే తన లక్ష్య సాధనకై విప్లవాత్మకమైన ‘మాలపల్లి’ నవలను రచించారు. ఆ నవల ఇప్పుడు శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటుంది. ఈ మాలపల్లి నవల దళిత కుటుంబాన్ని ప్రధాన కథాశంగా రచించిన తొలి రాజకీయ నవల.

తెలుగు నవల సాహిత్య వైతాళికుడిగా కీర్తిగాంచారు ఉన్నవ లక్ష్మీనారాయణ. అంతేకాదు మాలపల్లి నవల తెలుగు నవలా సాహిత్యంలో చిరస్మరణీయం.

reporter: Nagaraju, Guntur, TV9

Also Read:  తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..

ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ..
ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ..
నిద్ర లేమి సమస్యకు బెస్ట్ మెడిసిన్ ఈ పానీయాలు.. ట్రై చేసి చూడండి
నిద్ర లేమి సమస్యకు బెస్ట్ మెడిసిన్ ఈ పానీయాలు.. ట్రై చేసి చూడండి
Video: విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన అభిమానులు
Video: విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన అభిమానులు
హోండా కార్లపై తగ్గింపుల జాతర.. ఆ మోడల్స్‌పై నమ్మలేని ఆఫర్స్
హోండా కార్లపై తగ్గింపుల జాతర.. ఆ మోడల్స్‌పై నమ్మలేని ఆఫర్స్
ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను..
ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను..
ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ వెల్లడి
ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ వెల్లడి
హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ 4 పదార్థాలను అస్సలు తినకండి
హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ 4 పదార్థాలను అస్సలు తినకండి
కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
అప్పుడే ఓటీటీలోకి సాయి పల్లవి, శివ కార్తికేయన్‌ల 'అమరన్'.
అప్పుడే ఓటీటీలోకి సాయి పల్లవి, శివ కార్తికేయన్‌ల 'అమరన్'.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.