Healthy Food: ఈ ఐదు రకాల ఆహారాలతో అద్భుతమైన ప్రయోజనం.. తెలిస్తే తినకుండా ఉండలేరు!

మన ఆరోగ్యంగా ఉండటం, మెదడు చురుకుగా పని చేయాలంటే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. పలు ఆహారాల వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా..

Healthy Food: ఈ ఐదు రకాల ఆహారాలతో అద్భుతమైన ప్రయోజనం.. తెలిస్తే తినకుండా ఉండలేరు!
Healthy Food
Follow us
Subhash Goud

|

Updated on: Jan 05, 2023 | 5:55 AM

మన ఆరోగ్యంగా ఉండటం, మెదడు చురుకుగా పని చేయాలంటే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. పలు ఆహారాల వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా వివిధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఒమేగా-3 ఉండే ఆహారం తీసుకున్నట్లయితే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లం మంచి కేలరిలను అందిస్తుంది. మీ శరీరానికి శక్తిని ఇస్తుంది. గుండె పనితీరు మెరుగు పరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పరుస్తుంది. అయితే మన శరీరంలో ఉత్పత్తి చేసే అనేక రకాల కొవ్వులు ఉన్నాయి. ఒమేగా-3 ముఖ్యమైనది.

మనం ఆరోగ్యంగా ఉంటే మన శరీరం, మెదడు చక్కగా పనిచేస్తాయి. అలాగే సంతోషంగా కూడా ఉంటాం. ఇలా ఉండాలంటే మనం సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మన శరీరం సరిగ్గా పని చేసే తీరుకు చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఒమేగా-3 తీసుకోవడమే. ఒమేగా తీసుకోవడం వల్ల మన గుండె, చర్మం, మెదడు ఆరోగ్యం బాగా ఉంటుంది. అందుకే ఒమేగా త్రీ ఉన్న ఆహారం మీ ప్రతి రోజు భోజనం లో భాగం చేసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్యనిపులు. అయితే ఈ ఒమేగా అధికంగా లభించే పదార్థాలు ఏంటో చూద్దాం.

  1. అవిసె గింజలు: అవిసె గింజలు, చియా విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ విత్తనాలు ఇనుము, మెగ్నీషియం, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌తో పోరాడానికి ఉపయోగపడుతుంది.
  2. వాల్‌నట్స్‌: వాల్‌నట్స్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లలు అధిక సంఖ్యలో ఉంటాయి. దట్టంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. గుండె పనితీరుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్‌ స్థాయిలను మెరుగు పరుస్తాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. చేపలు: చేపల్లో కూడా ఒమేగా-3 అధిక శాతం ఉంది. చేపలు తినడం వల్ల చాలా బెనిఫిట్‌ ఉంటుంది. చేపల్లో ఒమేగా అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కండరాల పునరుత్పత్తికి ఉంతగానో ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.
  5. సోయాబీన్స్‌: సోయాబీన్స్ లో ఒమేగా-3 ఉంటుంది. ఫైబర్‌, ప్రోటీన్లుకు సోయా మంచి ఆహారం. సోయాబీన్స్‌ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షించుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  6. బ్లూబెర్రీస్‌: బ్లూబెర్రీస్‌లో కేలరీలు అధిక సంఖ్యలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండె జబ్బులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రక్తపోటు నుంచి కాపాడుతాయి. ఒమేగా-3 సప్లిమెంట్స్‌ ఉంటాయి. అవి తినడం వల్ల ఎంతగానో మేలు చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..