AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breathing Rate: అప్పుడే పుట్టిన శిశువు నిమిషానికి ఎన్నిసార్లు శాశ్వ తీసుకుంటుంది..!

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి శ్వాస సరిగ్గా ఉండటం ఎంతో ముఖ్యం. శ్వాస తీసుకోవడంలో తేడా వస్తే ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉంది. అయితే పుట్టిన శిశువుల్లో శ్వాస రేటు ఒక విధంగా ఉంటే..

Breathing Rate: అప్పుడే పుట్టిన శిశువు నిమిషానికి ఎన్నిసార్లు శాశ్వ తీసుకుంటుంది..!
Breathing Rate
Subhash Goud
|

Updated on: Dec 02, 2022 | 9:13 PM

Share

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి శ్వాస సరిగ్గా ఉండటం ఎంతో ముఖ్యం. శ్వాస తీసుకోవడంలో తేడా వస్తే ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉంది. అయితే పుట్టిన శిశువుల్లో శ్వాస రేటు ఒక విధంగా ఉంటే.. పెద్దలకు మరో విధంగా ఉంటుంది. గత మూడేళ్ల కిందట కోవిడ్‌ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ కారణంగా శ్వాస ఆడకుండా అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. కరోనా మహమ్మారి మన శరీరంలో వైరస్‌ ప్రవేశించిన తర్వాత శ్వాస కోశ వ్యవస్థపై వైరస్ దాడి చేసి ఎంతో మందిని బలి తీసుకుంది. ఈ వైరస్‌ వ్యాపించిందంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ప్రస్తుతం మానవుని శ్వాస రేటు అంటే ఏమిటి..? పిల్లల నుంచి పెద్దల వరకు ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటారో తెలుసుకుందాం.

శ్వాస రేటు అంటే ఏమిటి..?

వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస రేటు అంటే మీరు నిమిషంలో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో అని అర్థం. ముఖ్యంగా శ్వాస రేటు అనేది మన శరీరంపై ముఖ్యపాత్ర పోషిస్తుంది. శ్వాసలో ఇబ్బందులు తలెత్తితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శ్వాస ఆడకపోవడం వల్ల ప్రాణాలకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. శ్వాసకోశ రేటు తెలుసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను గుర్తించవచ్చు. చిన్న పిల్లలు, వయోజనుల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుంది.

వయోజనుల సాధారణ శ్వాసరేటు ఎలా ఉండాలి:

హెల్త్‌లైన్‌ డాట్‌కామ్‌ నివేదిక ప్రకారం.. పెద్దవారి సాధారణ శ్వాసరేటు నిమిషానికి 12 నుంచి 16 వరకు ఉంటుంది. అంటే ఆరోగ్యవంతులైన వయోజనుడు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు. మీ శ్వాస రేటు 12 కన్నా తక్కువ లేదా 16 కంటే ఎక్కువ ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కానీ మీ శ్వాస రేటులో పెద్ద వ్యత్యాసాన్ని చూసినప్పుడు తప్పకుండా ఆందోళన కలిగించే అంశమని గుర్తించాలి. మీ నాడీ వ్యవస్థలో జరిగే సమస్యలకు సాధారణ శ్వాసరేటు కంటే తక్కువ కారణం కావచ్చు. ఇది కాకుండా పెరుగుతున్న వయసుతో మన శ్వాస రేటు కూడా మారుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇక పిల్లల్లో శ్వాస రేటు:

వయోజనుడితో పోలిస్తే చిన్న పిల్లల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నిమిషానికి 30 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటుంది. ఈ శ్వాస రేటు పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఒక నిమిషంలో 24 నుంచి 34 సార్లు శ్వాస తీసుకుంటారు. 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు శ్వాస రేటు 18 నుంచి30 మధ్య ఉంటుంది. అలాగే 12 నుంచి 18 సంవత్సరాలున్న పిల్లలు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటారు. పెద్దవారి శ్వాస రేటు కూడా సమానంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్ది ఇది మారుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us