AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla Side Effects: ఈ వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా ఉసిరి తినవద్దు.. ఎందుకంటే

వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధగుణాలున్న ఉసిరిని ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు. అయితే ఉసిరిని ఈ వ్యాధులన్న రోగులు పొరపాటున కూడా తినకూడదు. లేకపోతే, మీరు లాభానికి బదులు అనేక ఇబ్బందులు పడవచ్చు. 

Amla Side Effects: ఈ వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా ఉసిరి తినవద్దు.. ఎందుకంటే
Gooseberry Side Effects
Surya Kala
|

Updated on: Dec 02, 2022 | 6:54 PM

Share

శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి అత్యంత ప్రయోజనకారి. అంతేకాదు.. ఆకుపచ్చ రంగు నిమ్మకాయ ఆకారంలో ఉండే ఈ ఉసిరికాయ ఉప్పు రుచి తప్పించి మిగిలిన ఇదు రుచులను కలిగి ఉంటుంది. వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధగుణాలున్న ఉసిరిని ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు. ఇందులో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో, కంటి చూపు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరి అత్యంత ప్రయోజనకారి. ఉసిరితో చట్నీ, మురబ్బా,  రైస్, వంటి అనేక రకాలు ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. అయితే ఉసిరిని ఈ వ్యాధులన్న రోగులు పొరపాటున కూడా తినకూడదు. లేకపోతే, మీరు లాభానికి బదులు అనేక ఇబ్బందులు పడవచ్చు.

జలుబుతో బాధపడే ఉసిరి తినకండి:

ఉసిరి చల్లదనాన్ని ఇస్తుంది. కనుక జలుబు, నంజు, లేదా జ్వరంతో బాధపడేవారు ఉసిరిని తినకూడదు. అనారోగ్యంతో  ఉన్నవారు ఉసిరిని తీసుకుంటే.. బాధితుల శరీర ఉష్ణోగ్రతను మరింత తగ్గిస్తుంది. ఒకొక్కసారి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.

ఇవి కూడా చదవండి

లో షుగర్ పేషేంట్స్: 

యాంటీ బయోటిక్ మందులు వాడే వారు ఉసిరికి దూరంగా ఉండాలి. అదేవిధంగా.. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్న రోగులు కూడా ఉసిరిని తినకూడదు. ఇలా చేయడం ద్వారా.. షుగర్ లెవెల్స్ మరింత తక్కువ అవుతాయి. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు.

మూత్రపిండాల రోగులకు హానికరం: 

మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు ఉసిరికాయను అస్సలు తినకూడదు. ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీంతో మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. సోడియంను మూత్రపిండాలు వడకట్టడం కష్టతరం. ఒకొక్కసారి మూత్రపిండాల వైఫల్యం కూడా అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.

శస్త్రచికిత్సకు 2 వారాల ముందు:

శస్త్రచికిత్స చేయించుకోవాలనుకునే రోగులు.. ఆపరేషన్‌కు 2 వారాల ముందు ఉసిరిని తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఉసిరి ఆపరేషన్ కు ముందు తినడం వలన ఒకొక్కసారి రక్త నాళాలు చీలడం, రక్తస్రావం అధికం అవ్వడం వంటి ప్రమాదాలకు కారణం అవుతుంది.

(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి చిట్కాలు, సాధారణ పాఠకుల ఆసక్తిని బట్టి.. దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇక్కడ ఇచ్చిన సూచనలు పాటించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. వీటిని టీవీ 9 తెలుగు  ధృవీకరించలేదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..